తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Murder In Janagam : రిటైర్డ్ ఎంపీడీవో కిడ్నాప్.. ఆపై దారుణంగా హత్య..! వాటిల్లో జోక్యమే కారణమా?

Murder in Janagam : రిటైర్డ్ ఎంపీడీవో కిడ్నాప్.. ఆపై దారుణంగా హత్య..! వాటిల్లో జోక్యమే కారణమా?

18 June 2023, 12:53 IST

google News
    • Jangoan District Crime News : కిడ్నాప్‌నకు గురైన రిటైర్డ్ ఎంపీడీవో కేసు విషాదాంతంగా మారింది. కిడ్నాపర్‌లు కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని జనగామ సమీపంలో గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. 
విశ్రాంత ఎంపీడీవో హత్య..?
విశ్రాంత ఎంపీడీవో హత్య..? (Unsplash)

విశ్రాంత ఎంపీడీవో హత్య..?

Retired MPDO Murder in Jangoan: జనగాం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీడీవో హత్యకు గురయ్యాడు. జూన్ 15వ తేదీన కిడ్నాప్ నకు గురైన ఆయన.... మృతదేహాంగా కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా... నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హత్య వెనక అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి.

ఏం జరిగిందంటే...?

జూన్15వ తేదీన బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి తన ద్విచక్రవాహనంపై పోచన్నపేటకు వస్తుండగా విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ అయ్యారు. అదే రోజు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురిపై అనుమానం కూడా వ్యక్తం చేశారు. దాదాపు 30 మందిని పోలీసులు విచారించారు. బచ్చన్నపేట, జనగామ పరిసర ప్రాంతాల్లో పోలీసు బృందాలు గాలించాయి. శనివారం సాయంత్రం జనగామ, బచ్చన్నపేట రహదారి మధ్యలో చంపక్‌హిల్స్‌ అటవీ ప్రాంతంలో రామకృష్ణయ్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అయితే శనివారం ఉదయం ఎంపీడీవో కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... అధికార పార్టీకి చెందిన కొందరిపై కూడా ఆరోపణలు చేశారు. అయితే సాయంత్రం.... రామకృష్ణయ్య విగతజీవిగా కనిపించటం సంచలనంగా మారింది.

రామకృష్ణయ్య 15 ఏళ్ల కిందట జనగామ జిల్లా రఘునాథపల్లి ఎంపీడీఓగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేశారు. రామకృష్ణయ్య ఇటీవల కాలంలో బచ్చన్నపేట మండలంలో పరిధిలో ఓ భూమి వ్యవహరంలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక గతకొంతకాలంగా ఆర్టీఐ ద్వారా.... పలువురు వ్యక్తులకు సంబంధించిన భూ వివాదాల వివరాలను సేకరించినట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలోనే ఆయనపై పలువురు కక్ష పెంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కోణంలోనే హత్య జరిగి ఉండొచన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసుల విచారణ తర్వాత… అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది.

తదుపరి వ్యాసం