తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rbi Competitions 2024 : ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు - వ్యాసరచన పోటీలో పాల్గొనే ఛాన్స్

RBI Competitions 2024 : ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు - వ్యాసరచన పోటీలో పాల్గొనే ఛాన్స్

HT Telugu Desk HT Telugu

19 February 2024, 22:42 IST

google News
    • RBI Financial Literacy Weeks  2024: ఆర్బీఐ నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా వ్యాస రచన పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా అధికారులు ప్రకటన విడుదల చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు

RBI Financial Literacy Week Competitions 2024: ఈ నెల 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అధ్వర్యంలో జిల్లా స్థాయిలో పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యజిత్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో వ్యాసరచన, నినాదం, పోస్టర్ మేకింగ్ అనే మూడు విభాగాల్లో పోటీలను పాఠశాల మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

నినాదాలు రాయండి.....

వ్యాసరచన విభాగంలో " నేను రాత్రికి రాత్రే మిల్లియనియర్ గా మారితే, ఆ డబ్బును ఎలా ఉపయోగిస్తాను" అనే అంశం పై 300 పదాలతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లో రాయవచ్చని అన్నారు. నినాదం విభాగంలో "పొదుపు మరియు చక్రవడ్డీ యొక్క శక్తి" అనే అంశంపై, పోస్టర్ విభాగంలో " డిజిటల్ మరియు సైబర్ పరిశుభ్రత" అనే అంశంపై చేతితో గానీ, డిజిటల్గా గానీ వేయవచ్చని అన్నారు.

అన్ని ప్రభత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 10 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సు గల విద్యార్థులు అందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు. విద్యార్థి పేరు, పాఠశాల లేదా కళాశాల పేరు, ప్రభుత్వ లేదా ప్రైవేట్, వయస్సు, ఫోన్ నంబర్ తప్పనిసరిగా దరఖాస్తులో పేర్కొనాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఈ మూడు పోటీలలో విజేతలకు బహుమతి, సర్టిఫికేట్ ప్రధానంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందుతారని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు లీడ్ బ్యాంక్ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్, దుద్దెడ గ్రామం, చేరుకోవాలి. 27న అన్ని పాఠశాలలు మరియు కళాశాల పిల్లలతో వాకథాన్ ఉంటుంది మరియు జిల్లా కలెక్టర్ సూచన మేరకు సంబంధిత జిల్లా అధికారులు కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనీ సత్యజిత్ పిలుపునిచ్చారు.

సిద్దిపేట జిల్లాలో ప్రజావాణి దరఖాస్తులు

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతు....ప్రజావాణి కార్యక్రమం పై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. ఎంతో నమ్మకం తో జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలను విన్నవించుకోని పరిష్కారానికి ప్రజావాణి కి వస్తారని అంతే నమ్మకంగా అర్జిదారుల సమస్యలను వెంటనే పరిష్కరించినచో వారికి న్యాయం చేసిన వాళ్లం అవుతామని జిల్లా అధికారులకు సూచించారు. ప్రజావాణి లో భూ సంబందిత, ఆసరా పింఛన్లు ఇతర మొత్తం కలపి 24 దరఖాస్తులు స్వీకరించారు. ఇట్టి కార్యక్రమం లో డిఆర్ఓ నాగ రాజమ్మ, డిఆర్డిఏ పిడి జయదేవ్ ఆర్యా, కలెక్టరేట్ ఎఓ అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి.

తదుపరి వ్యాసం