తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  బాలికపై ఇంట్లో అద్దెకుండే యువకుడి అత్యాచారం.. మరోచోట దొంగాపోలీస్ ఆట పేరుతో..

బాలికపై ఇంట్లో అద్దెకుండే యువకుడి అత్యాచారం.. మరోచోట దొంగాపోలీస్ ఆట పేరుతో..

HT Telugu Desk HT Telugu

08 June 2022, 16:26 IST

google News
    • కొన్ని రోజులుగా.. బాలికలపై అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వరుసగా ఘటనలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో బాలిక.. తనపై అత్యాచారం జరిగిందని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లో అద్దెకుండే యువకుడు తనపై అత్యాచారం చేశాడని ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సికింద్రాబాద్ మోండా మార్కెట్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎల్లేశ్ అనే యువకుడు ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. దంపతులతోపాటుగా.. పదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంటున్నారు. మాయమాటలతో ఎల్లేశ్ కుటుంబానికి దగ్గరయ్యాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చేసి పెట్టేవాడు. కుటుంబ సభ్యులు పూర్తిగా అతడిని నమ్మేశారు.

అయితే ఈనెల 1న ఇంట్లో నుంచి బాలిక వెళ్లిపోయింది. అనంతరం ఎల్లేశ్ కూడా కనిపించకుండా పోయాడు. అనుమానంతో.. తల్లిదండ్రులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేయడం ప్రారంభించారు. బాలిక కోసం వెతికారు. కానీ తాజాగా బాలిక పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తమ ఇంట్లో అద్దెకు ఉండే ఎల్లేశ్ అనే యువకుడు తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. అతడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

నిజామాబాద్‌లోనూ

నిజామాబాద్‌లోనూ బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాగుడుమూతలు ఆడదామని చెప్పి ఓ బాలికకు యువకుడు దగ్గరయ్యాడు. ఆమె నగ్న చిత్రాలు తీసి, వాటిని చూపి బెదిరిస్తూ పలుసార్లు లైంగిక దాడి చేశాడు. అయితే అదే బాలికకు ఇన్‌స్టాగ్రామ్ లో మరో వ్యక్తి ఇటీవలే పరిచయమయ్యాడు. అతడు కూడా బాలికను లొంగదీసుకున్నాడు.

నిజామాబాద్‌ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్టుమెంట్‌లో బాధిత బాలిక కుటుంబం ఉంటుంది. అదే అపార్టుమెంట్‌లో రోహిత్‌ అనే యువకుడు ఉన్నాడు. 2017 నుంచే వీరిద్దరికి పరిచయం ఉంది. బాలికతో యువకుడు చనువు పెంచుకున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దొంగాపోలీస్ ఆట పేరుతో అపార్ట్ మెంట్‌ పైకి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితమే బాలిక నగ్న చిత్రాలను ఫోన్‌లో తీసి పెట్టాడు. వాటిని చూపించి తాను చెప్పినట్లు వినకపోతే బయట పెడతానంటూ బెదిరించేవాడు. రెండేళ్ల క్రితం అవే చిత్రాలను చూపించి తన ఇంట్లోకి బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లోనూ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో మళ్లీ అత్యాచారం చేశాడు.

ఇదే బాలికకు.. బానుప్రసాద్‌ గౌడ్‌ అనే యువకుడు ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పడంతో ఆమె నమ్మింది. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో బాను ప్రసాద్ నగ్న చిత్రాలు తీశాడు. వాటిని తిరిగి ఆమెకే పంపి బెదిరించేవాడు. భయంతో కొంతకాలంగా ఇద్దరి వేధింపులను బాలిక భరించింది. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో.. తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదుచేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం