తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rfcl Job Notification: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు…ప్రొఫెషనల్‌ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రకటన

RFCL Job Notification: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు…ప్రొఫెషనల్‌ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రకటన

Sarath chandra.B HT Telugu

23 February 2024, 13:19 IST

google News
    • RFCL Job Notification: రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో ప్రొఫెషనల్స్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

RFCL Job Notification: రామగుండం ఫెర్టిలైజన్స్‌ అండ్ కెమికల్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్‌ఎఫ్‌ఎల్‌, ఈఐఎల్‌, ఎఫ్‌సిఐఎల్‌ జాయింట్ వెంచర్‌ సంస్థ అయిన రామగుండంఫెర్టిలైజర్స్‌ కంపెనీలో అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మార్చి 20వ తేదీలోగా దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయసు, అనుభవం వివరాలను పూర్తి నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

నేషనల్ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌, ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్‌ వెంచర్‌గా రామగుండంలో నిర్వహిస్తున్న ఫెర్టిలైజర్స్‌ కంపెనీలో రోజుకు 2200 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఆధారిత అమ్మోనియా, 3850 మెట్రిక్ టన్నుల నీమ్ కోటెడ్ యూరియా ఉత్పత్తి చేస్తారు.

తాజా నోటిఫికేషన్‌లో పలు రకాల ఉద్యాగాలను భర్తీ చేయనున్నారు.రామగుండంతో పాటు నోయిడాలోని కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

తాజా నోటిఫికేషన్‌లో కెమికల్ Chemicalవిభాగంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పే స్కేల్ రూ.50,000-1,60,000 పోస్టులు 2, సీనియర్ మేనేజర్‌ పే స్కేల్ రూ.80,000-రూ.2,20,000 పోస్టులు 1, చీఫ్‌ మేనేజర్‌ పే స్కేల్ రూ.90,000-రూ.2,40,000 పోస్టు 1 భర్తీ చేస్తారు.

మెకానికల్ Mechanical విభాగంలో మేనేజర్ పే స్కేల్ రూ.70,000-2,00,000 పోస్టులు 2, చీఫ్ మేనేజర్ పోస్టు పేస్కేల్‌రూ.90,000-రూ.2,40,000 పోస్టు 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ పే స్కేల్ రూ.90,000-2,60,000 ఒకటి భర్తీ చేస్తారు.

ఎలక్ట్రికల్ Electrical విభాగంలో సీనియర్ మేనేజర్ పోస్ట్ పేస్కేల్ రూ.90,000- 2,20,000తో ఒక పోస్టు భర్తీ చేస్తారు. ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగంలో చీఫ్‌ మేనేజర్‌ పోస్టు ఒకటి భర్తీ చేసక్తారు. కెమికల్ ల్యాబ్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులు 2, డిప్యూటీ మేనేజర్ పోస్టు 1 భర్తీ చేస్తారు.

మెటీరియల్స్ materials విభాగంలో చీఫ్ మేనేజర్ పేస్కేల్ రూ.90,000-2,40,000 పోస్టులు రెండు భర్తీ చేస్తారు. ఫైనాన్స్‌ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 2, చీఫ్ మేనేజర్ పోస్టు 1భర్తీ చేస్తారు. హ్యుమన్ రిసోర్స్‌లో రెండు పోస్టులు భర్తీ చేస్తారు. మెడికల్ విభాగంలో మూడు పోస్టులు, సేఫ్టీ విభాగంలో రెండు పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తం 27 ఉద్యోగాలను తాజా నోటిఫికేషన్‌లో భర్తీ చేయనున్నారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆర్‌ఎఫ్‌సిఎల్‌ వెబ్‌ సైట్ https://www.rfcl.co.in కెరీర్స్‌ విభాగంలో పూర్తి వివరాలను చూడవచ్చు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి నోటిఫికేషన్ అందుబాటులోకి రానుంది. మార్చి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆర్‌ఎఫ్‌సిఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. నోటిఫికేషన్ సవరణ, అనుబంధ నోటిఫికేషన్, మార్పుల గురించి వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని ఆర్‌ఎఫ్‌సిఎల్ పేర్కొంది.

తదుపరి వ్యాసం