RFCL Jobs: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్
01 September 2024, 12:17 IST
- RFCL Jobs: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు
RFCL Jobs:రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీలో ఐటిఐ విద్యార్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎన్‌ఎఫ్‌ఐఎల్, ఈఐఎల్, ఎఫ్‌సిఐఎల్ జాయింట్ వెంచర్ కంపెనీ నిర్వహణలో రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో ఐటిఐ విద్యార్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మెకానికల్ విభాగంలో ఐటి విద్యార్హతతో అటెండెంట్ గ్రేడ్ 1లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో ఫిట్టర్ పోస్టులు 10, డీజిల్ మెకానిక్ 3, మెకానిక్ హెవీ వెహికల్ రిపేర్స్-మెయింటెయినెన్స్ లో 2 పోస్టులు భర్తీ చేస్తారు.
అటెండెంట్ గ్రేడ్1 ఎలక్ట్రికల్ విభాగంలో 15ఎలక్ట్రిషియన్ పోస్టులు భర్తీ చేస్తారు. అటెండెంట్ గ్రేడ్1 ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో ఎలక్ట్రానిక్ మెకానిక్ విభాగంలో 4పోస్టులు, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్ పోస్టులు 5 భర్తీ చేస్తారు.
ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.rfcl.co.in వెబ్‌సైట్‌లోని కెరీర్స్ విభాగంలో లభిస్తాయి.
ఉద్యోగాల కోసం దరఖాస్తులను సమర్పించడానికి 2024 ఫిబ్రవరి22లోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సవరణలు, మార్పులు చేర్పులు, తేదీల వివరాలను కేవలం ఆర్‌ఎఫ్‌సిఎల్ వెబ్‌సైట్‌లో మాత్రమే పొందుపరుస్తారు.