తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Rajiv Arogyasri Scheme : తెలంగాణలో 'రాజీవ్ ఆరోగ్య శ్రీ' స్కీమ్ - కొత్తగా వచ్చిన మార్పులెంటో చూడండి

TS Rajiv Arogyasri Scheme : తెలంగాణలో 'రాజీవ్ ఆరోగ్య శ్రీ' స్కీమ్ - కొత్తగా వచ్చిన మార్పులెంటో చూడండి

10 December 2023, 6:35 IST

google News
    • Telangana Rajiv Arogyasri scheme : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్ ను అమల్లోకి తీసుకొచ్చింది. గతానికి భిన్నంగా కీలకమైన మార్పులు చేసింది. అవెంటో ఇక్కడ చూడండి...
రాజీవ్ ఆరోగ్య శ్రీ' స్కీమ్
రాజీవ్ ఆరోగ్య శ్రీ' స్కీమ్

రాజీవ్ ఆరోగ్య శ్రీ' స్కీమ్

Rajiv Arogyasri scheme in Telangana : తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్... హామీల అమలుపై దృష్టిపెట్టింది. ప్రభుత్వంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే... ఎన్నికల హామీలో ప్రకటించిన ఆరోగ్య శ్రీ బీమా స్కీమ్ ను పట్టాలెక్కింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...ఈ పథకాన్ని డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ లో ప్రారంభించారు. అయితే గతంలోనే ఉన్న ఆరోగ్య శ్రీ స్కీమ్ కు... ప్రస్తుతం అమలవుతున్న స్కీమ్ కు తేడాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ చూద్దాం....

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం:

- కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. అందులో ఒకటి చేయూత. దీనిలోని అంశమే రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా స్కీమ్.

- బీపీఎల్ కుటుంబాలకు రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించడం ఈ పథకం లక్ష్యం.

- తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలు బీపీఎల్ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

- గతంలో రూ. 5 లక్షల వరకే ఆరోగ్య బీమా ఉండగా... ప్రస్తుతం ఇది రూ. 10 లక్షలకు(ఏడాదికి) పెరిగింది.

- ఈ స్కీమ్ లో భాగంగా 1672 వైద్య సేవలు కవర్ అవుతాయి.

-రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఇది అమలవుతుంది.

- ప్రస్తుతం తెలంగాణలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి.

-ఆరోగ్య శ్రీ పథకాన్ని వైఎస్ హయాంలో తీసుకొచ్చారు.

-ఇప్పటి వరకు ఐదు లక్షల పరిమితితో ఈ స్కీమ్ కొనసాగింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… రూ. 10 లక్షల వరకు పరిమితిని పెంచింది.

తదుపరి వ్యాసం