తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rains In Ap And Ts : అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Rains in AP and TS : అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

HT Telugu Desk HT Telugu

25 July 2022, 11:31 IST

google News
    • ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ల మీదుగా విస్తరించిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రా, తెలంగాణలలో వర్షాలు కురుస్తున్నాయి. గత వారంతో పోలిస్తే వానలు తగ్గుముఖం పట్టినా  అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పాడేరు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షాలు కురవనున్నాయి. రాయలసీమ ప్రాంతంలో రాత్రిపూట వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి నగరాల్లో కూడా ఈ ప్రభావంతో వర్షాలు కురువనున్నాయి. విశాఖపట్నంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆఱ్‌, ఏలూరు, కోనసీమ, తూర్పు గోదావరి, ప్రకావం జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉండనుంది.

అటు తెలంగాణలో గత వారంతో పోలిస్తే ఏపీలో వర్షాలు కాస్త తగ్గు ముఖం పట్టాయి. ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో ఏపీలోని కోస్తా తీరంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. సముద్ర ఉపరితలానికి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండటంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఐదు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్రలో ఓ మాదిరి వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి. రాయలసీమలో చిరుజల్లులు కురుస్తాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువకు వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలంలో వరద ప్రవాహం 39.30అడుగులుగా కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద 9లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

తదుపరి వ్యాసం