Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ వర్షం... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
28 September 2022, 10:26 IST
- Rain in hyderabad: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు నిలిచిపోయింది.
హైదరాబాద్ లో వర్షాలు
Hyderabad Heavy Rains: హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇవాళ కూడా నగరంలో మళ్లీ వర్షం కురుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాయువ్వ దిశల నుంచి గాలులు(గాలి వేగం గంటకు 04 -08 కి.మీ) వీచే అవకాశం ఉందని తెలిపింంది.
ఇక మంగళవారం హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. భారీ వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్ లో కుండపోత వాన కురిసింది. నాంపల్లి, గోశామహల్, కోఠి, బషీరాబాద్, నారాయణగూడ, అఫ్జల్ గంజ్, మల్లేపల్లి, చిక్కడపల్లి, అశోక్ నగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అతి భారీ వర్షం కురుస్తోంది.
ఈ జిల్లాలకు అలర్ట్....
Rains in Telangana: హైదరాబాద్ వాతావరణశాఖ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలలో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.