తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Weather : భిన్నమైన వాతావరణం… తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు!

TS Weather : భిన్నమైన వాతావరణం… తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు!

HT Telugu Desk HT Telugu

04 November 2023, 10:43 IST

google News
    • Telangana Weather Updates: తెలంగాణలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా… మరికొన్నిచోట్ల చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మరోవైపు ఇవాళ, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణకు వర్ష సూచన

Telangana Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నేడు,రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని ఆగ్నేయ ప్రాంతాల్లో నేడు రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు ప్రకటించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.చలికాలం ప్రారంభం అయి చాలా రోజులు అవుతున్నా ఉష్ణోగ్రతలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికాలంలో కూడా ఏసీలు,కూలర్లు మరియు ఫ్యాన్ లకే జనం అత్తుకుపోతున్నారు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అత్యధికంగా ఖమ్మంలో

శుక్రవారం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో సాధారణం కన్నా 4.8 డిగ్రీలు అధికంగా పెరిగి 36 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భద్రాచలంలో 2.7 డిగ్రీలు అధికంగా పెరిగి 34.6 డిగ్రీల సెల్సియస్ , ఆదిలాబాద్ లో 2.3 డిగ్రీలు అధికంగా పెరిగి 32.8 డిగ్రీల సెల్సియస్ ,హనుమకొండ లో 1.2 డిగ్రీలు అధికంగా పెరిగి 32.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు

గత మూడు రోజుల నుంచి రాత్రిపూట కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు అధికారులు వివరించారు.గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు దుండిగల్ లో 5.1 డిగ్రీలు పెరిగి 23 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు.అటు ఆంధ్రప్రదేశ్ లోను ద్రోణి ప్రభావం వల్ల పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇక హైదరాబద్ వాతావరణం విషయానికి వేస్తే నగరంలో కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం మరియు మరి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

రిపోర్టర్: కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం