తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  President Hyd Tour : ఈనెల 17న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Hyd Tour : ఈనెల 17న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

14 June 2023, 14:03 IST

    • President Droupadi Murmu Latest News: జూన్ 17వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.
హైదరాబాద్ పర్యటనకు రాష్ట్రపతి (ఫైల్ ఫొటో)
హైదరాబాద్ పర్యటనకు రాష్ట్రపతి (ఫైల్ ఫొటో) (twitter)

హైదరాబాద్ పర్యటనకు రాష్ట్రపతి (ఫైల్ ఫొటో)

President Droupadi Murmu Hyderabad Tour: దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ టూర్ ఖరారైంది. ఈ నెల 17న హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించనున్న కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ (సీజీపీ)కు ముఖ్యఅతిథిగా హాదరుకానున్నారు. ఈ మేరకు డిఫెన్స్‌ విభాగం ఒక ప్రకటనలో వివరాలను తెలిపింది. దుండిగల్‌లోని అకాడమీలో జరగనున్న ఈ పరేడ్‌కు సంబంధించి వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్‌ క్యాడెట్లకు ప్రీ కమిషనింగ్‌ ట్రైనింగ్‌ ఇప్పటికే పూర్తైనట్లు ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Hyd Bike Blast: హైదరాబాద్‌లో ఘోరం, బైక్‌‌లో మంటలు ఆర్పుతుండగా భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Medak Crime News : దారుణం.. బెట్టింగ్‌ ఆడుతున్నాడని కుమారుడిని రాడుతో కొట్టి చంపిన తండ్రి

పరేడ్‌ కార్యక్రమం తర్వాత... శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ర్యాంకులు, అవార్డులు అందజేయనున్నారు. ఇండియన్‌ నేవీ, ఇండియన్‌ కోస్ట్‌గార్డు, వైమానిక దళ క్యాడెట్లు, మన దేశంతో స్నేహపూర్వకంగా ఉండే సరిహద్దు దేశాలకు చెందిన క్యాడెట్లకు ‘వింగ్స్‌’, ‘బ్రెవెట్స్‌’ను రాష్ట్రపతి ప్రదానం చేస్తారని అధికారులు తెలిపారు.

అమిత్ షా తెలంగాణ టూర్…

Amit Shah Tour: మరోవైపు కేంద్రమంత్రి అమిత్‌షా రెండ్రోజుల పర్యటన కోసం బుధవారం రాత్రికి హైదరాబాద్‌ రానున్నారు. రాత్రి 11.55నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. హైదరాబాద్‌ నోవాటెల్ హోటల్లో అమిత్ షా రాత్రి బస చేస్తారు. గురువారం ఉదయం 7.30గంటలకు నోవాటెల్ హోటల్లో తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం అవుతారు.

బీజేపీ నేతలతో భేటీ అనంతరం హైదరాబాద్ లో పలువురు ప్రముఖులను అమిత్ షా కలవునున్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా గురువారం ఉదయం 11గంలకు ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో ఆయన నివాసంలో అమిత్ షా భేటీ అవుతారు. 11.45గంలకు సినీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని మణికొండలోని ఆయన నివాసంలో కలవనున్నారు. 12.45గంలకు గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు శంషాబాద్ జేడీ కన్వెన్షన్ లో బీజేపీ కార్యకర్తలతో లంచ్ మీటింగ్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నాం 2.25గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 3.50గ‌ంటలకు భద్రాచలంకు అమిత్ షా వెళ్తారు. సాయంత్రం 4నుంచి 4.40గంటల వరకు రాములోరి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5గంటలకు భద్రాచలం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 5.35గంటలకు అమిత్ షా ఖమ్మం చేరుకుంటారు.

సాయంత్రం 5.40నుంచి 5.55గంటల మధ్యలో ఖమ్మంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. సాయంత్రం 6గంటల‌ నుంచి 7గంటల మధ్య ఆర్జీఎమ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో జరగనున్న పబ్లిక్ మీటింగ్ లో అమిత్ షా పాల్గొంటారు. రాత్రి 7గంటల నుంచి 7.40గంటల మధ్య ఖమ్మం గెస్ట్ హౌస్‌ లో అమిత్ షా డిన్నర్‌లో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో ఖమ్మంలో బయలుదేరి రాత్రి 10.10గంలకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. రాత్రి 10.15గంలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి అర్థరాత్రి 12.05గంలకు అహ్మదాబాద్ చేరుకుంటారు. అమిత్‌షా పర్యటన కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

తదుపరి వ్యాసం