Botcha on amitshah: బీజేపీ ఆంధ్రాకు ప్రత్యేకంగా ఏమిచ్చిందని ప్రశ్నించిన బొత్స
Botcha on amitshah: బీజేపీ ఏపీకిప్రత్యేకంగా ఏ ప్రాజెక్టుఇచ్చిందని బొత్స ప్రశ్నించారు. విశాఖలో కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ తప్పు పట్టారు. టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను అమిత్‌షా చదివారని, రోజూ ప్రభుత్వ వ్యతిరేక పత్రికల్లో వచ్చే వార్తలు తప్ప కొత్త ఏముందన్నారు.
Botcha on amitshah: విశాఖలో రాజకీయ లబ్ది పొందడానికి అమిత్‌షా అవినీతి ఆరోపణలు చేశారని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక, కడుపు మంటలో అవినీతి ఆరోపణలు చేశారన్నారు. అమిత్‌షా చెప్పే వరకు జివిఎల్‌కు విశాఖలో అక్రమాలు తెలియలేదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే వైసీపీకి ముఖ్యమని, విభజన హామీలను అమలు చేయాలని నాలుగేళ్లుగా కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామన్నారు.
విశాఖ సమావేశంలో టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ అమిత్ షా చదివారని, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఆంధ్రాకు కూడా నిదులు ఇచ్చారని బొత్స చెప్పారు చెప్పారు. పత్రికల్లో వచ్చిన మాటలే అమిత్ షా చెప్పారని, కొత్తగా ఏమి చెప్పారని ప్రశ్నించారు. జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వాటితో జగన్ కు మంచి పేరు వచ్చేస్తుందనే అక్కసు తప్ప ఆరోపణల్లో మరేమి లేదన్నారు.
ఎదుటి వారిని విమర్శించే ముందు గురివింద గింజ కింద ఉన్న మచ్చ చూసుకోవాలని, ఎదుటి వారిని విమర్శించే ముందు వారిపై వచ్చే విమర్శలు గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పడాన్ని బొత్స తప్పు పట్టారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
దామాషా ప్రకారం పన్నుల్లో అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించినట్లు ఏపీకి కూడా కేటాయించారని చెప్పారు. అమిత్ షా చెబితేనే ఏపీలో జివిఎల్‌కు అవినీతి గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు విజన్‌తో మాట్లాడాలని, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు హక్కుగా నిధుల పంపిణీలో వాటాలు వస్తాయన్నారు. యూపీ, బీహార్‌లకు ఇచ్చినట్లు ఆంధ్రాకు ఏమిచ్చారో చెప్పాలన్నారు. వందే భారత్ రైలు గురించి చెప్పారని, వందేభారత్ రైళ్లు ఇవ్వడం గొప్పా అని బొత్స ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిన ప్రాజెక్టులు ఏమున్నాయో చెబితే బాగుండేదన్నారు. అలా చెప్పి ఉంటే తాము కూడా అమిత్‌షాకు కృతజ్ఞతలు చెప్పి ఉండేవారిమన్నారు. అందరితో పాటు ఇచ్చిన వాటిని కూడా ప్రత్యేకంగా చెప్పడం ఏమిటన్నారు.