తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhainsa High Alert: బైంసాలో 600 మందితో పోలీసు బందోబస్తు

Bhainsa high alert: బైంసాలో 600 మందితో పోలీసు బందోబస్తు

HT Telugu Desk HT Telugu

26 September 2023, 5:59 IST

google News
    • Bhainsa high alert: నిర్మల్ జిల్లా బైంసాలో మంగళవారం జరగనున్న వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక నిమజ్జనం జరగనున్న ఏరియాలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భైంసాలో బందోబస్తు పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ
భైంసాలో బందోబస్తు పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ

భైంసాలో బందోబస్తు పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ

Bhainsa high alert: నిర్మల్ జిల్లా బైంసాలో మంగళవారం జరగనున్న వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక నిమజ్జనం జరగనున్న ఏరియాలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

భైంసా పట్టణం నుండి గడ్డన్న వాగు ప్రాజెక్టు వరకు శోభయాత్ర జరిగే రూట్ మ్యాప్ ను జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ స్థానిక పోలీసులు కలిసి పరిశీలించారు. అత్యంత సున్నితమైన ప్రాంతాలలో తగు ఏర్పాట్లు చేశారు, బైంసా ఏ.యస్.పి క్రాంతిలాల్ పాటిల్‌తో చర్చించి తగు సూచనలు అందించారు.

నిమజ్జన కార్యక్రమాన్ని కంట్రోల్ రూమ్ ద్వారా తమ సిబ్బంది 24 గంటలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుటారని ప్రజలకు పోలీసులు తెలిపారు. అడుగడుగునా సీసీ కెమెరాలు అమర్చినట్మలు తెలిపారు. శోభాయాత్రలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం డీజే లకు పర్మిషన్ లేనందున కేవలం 750 వాట్స్ వరకే స్పీకర్లకు అనుమతించినట్లు పోలీసు వారు పేర్కొన్నారు.

గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జిల్లా ఎస్పీ తో పాటు, ముగ్గురు అడిషనల్ డీఎస్పీలు, నలుగురు డిఎస్పీలు, 15 మంది సీఐలు, 45 మంది ఎస్ఐలు, ఇతర సిబ్బంది 575 మంది కానిస్టేబుళ్లు విధులలో పాల్గొంటున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. శోభాయాత్రలో వదంతులు నమ్మరాదని, ఎలాంటి అనుమాన సంకేతాలు వచ్చిన, వినిపించిన తమ సిబ్బందికి సమాచారం అందించాలని తెలిపారు.

గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది శోభయాత్రను ప్రశాంతంగా, శాంతియుతంగా ముగిస్తారని ప్రజలందరూ పోలీసులతో సహకరిస్తారని ఆశిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. పోలీసులు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తుందని, అనుమాలకు తవివ్వకూడదని అన్నారు. బైంసా ఏఎస్పి కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో భారీ పోలీస్తు ర్యాలీ నిర్వహించారు. నిమజ్జనంలో నృత్యాలు,కోలాటం భక్తి పాటలు,భజన కీర్తనలు సంస్కృతిని చాటేలా శోభాయాత్ర నిర్వహించుకుందామని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించుదామని హిందూ ఉత్సవా కమిటీ అధ్యక్షులు విలాస్ గాదేవా తెలిపారు.

నిర్మల్ జిల్లా బైంసాలో మంగళవారం జరగనున్న వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక నిమజ్జనం జరగనున్న ఏరియాలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రిపోర్టర్ : కామోజీ వేణుగోపాల్, ఆదిలాబాద్

తదుపరి వ్యాసం