తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pm Modi On Hyderabad Student : పేద పిల్లల కోసం 7 లైబ్రరీలు, హైదరాబాద్ విద్యార్థినిపై ప్రధాని ప్రశంసలు

PM Modi On Hyderabad Student : పేద పిల్లల కోసం 7 లైబ్రరీలు, హైదరాబాద్ విద్యార్థినిపై ప్రధాని ప్రశంసలు

HT Telugu Desk HT Telugu

25 September 2023, 14:12 IST

google News
    • PM Modi On Hyderabad Student : చిన్నారుల కోసం ఏడు లైబ్రరీలను సొంత ఏర్పాటు చేసిన నడుపుతున్న ఆకర్షణ అనే హైదరాబాద్ విద్యార్థిని ప్రధాని మోదీ ప్రశంసించారు.
విద్యార్థిని ఆకర్షణ
విద్యార్థిని ఆకర్షణ

విద్యార్థిని ఆకర్షణ

PM Modi On Hyderabad Student : హైదరాబాద్ విద్యార్థినిని ప్రధాని మోదీ ప్రశంసించారు. బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS)లో 7వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల ఆకర్షణ ఆదివారం మన్ కీ బాత్ 105వ ఎడిషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకుంది. 12 ఏళ్ల ఆకర్షణ చిన్న పిల్లల కోసం ఏకంగా 7 లైబ్రరీలను సొంతంగా ఏర్పాటు చేసింది.

మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ మాటలు

రెండేళ్ల క్రితం పిల్లలకు సహాయం చేసేందుకు తల్లితండ్రులతో కలిసి క్యాన్సర్ ఆస్పత్రికి ఆకర్షణ వెళ్లగా అక్కడ కొంత మంది పిల్లలు "కలరింగ్ బుక్స్" అడిగారు. దీంతో అప్పటి నుంచి ఆకర్షణ రకరకాల పుస్తకాలు సేకరించి పిల్లల కోసం ఒక్కో లైబ్రరీ ఏర్పాటు చేస్తూ మొత్తానికి 7 లైబ్రరీలు హైదరాబాద్ లో నడుపుతుందని ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో తెలిపారు. ఆమె తన ఇరుగుపొరుగు వాళ్లు, బంధువులు, స్నేహితుల నుంచి పుస్తకాలను సేకరించి క్యాన్సర్ ఆసుపత్రిలో పిల్లల కోసం మొదటి లైబ్రరీ ప్రారంభించిందన్నారు .పేద పిల్లల కోసం వివిధ ప్రదేశాలలో ఇప్పటి వరకు ప్రారంభించిన ఏడు లైబ్రరీలలో ఇప్పుడు సుమారు 6 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో చిన్నారి ఆకర్షణ విశేష కృషి చేస్తున్న తీరు అందరిలోనూ స్ఫూర్తి నింపుతోందని ప్రధాని మోదీ కొనియాడారు

పిల్లలు పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్న ప్రధాని

నేటి యుగం డిజిటల్ టెక్నాలజీ, ఇ-బుక్స్‌తో ఉందని ప్రధాని మోదీ అన్నారు. పుస్తకాలు ఎల్లప్పుడూ మన జీవితంలో మంచి స్నేహితుని పాత్ర పోషిస్తాయన్నారు. అందుకే పిల్లలను పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన అన్నారు. అక్టోబరు 1 ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో ఆకర్షణతో సమావేశమవుతానని అన్నారు.

ట్విట్టర్ లో కూడా కూడా ప్రశంసలు

హైదరాబాద్ కు చెందిన 11 ఏళ్ల ఆకర్షణ పిల్లల కోసం ఏడు లైబ్రరీలను నిర్వహిస్తోంది. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆమె సహకరిస్తున్న తీరు స్ఫూర్తిదాయకం అని ప్రధాని అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం