తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dial 100 | 100కు ఫోన్ చేసి రెండు బీర్లు తెమ్మన్నాడు.. చివరకు..

Dial 100 | 100కు ఫోన్ చేసి రెండు బీర్లు తెమ్మన్నాడు.. చివరకు..

HT Telugu Desk HT Telugu

09 May 2022, 17:05 IST

    • ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్లను మిస్ యూజ్ చేస్తున్నారు కొంతమంది. తాజాగా ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ డయల్ 100కు కాల్ చేసి.. రెండు బీర్లు తెమ్మన్నాడు ఓ వ్యక్తి.
డయల్ 100
డయల్ 100

డయల్ 100

ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ డయల్ 100కు కాల్ చేసి.. పోలీసుల్ని రెండు బీర్ బాటిల్స్ తీసుకురమ్మని అడిగాడు వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. దీంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో.. ప్రజలకు అనేక విధాలుగా అండగా ఉంటున్న పోలీసులను ఇలా అడగడంతో అందరికీ కోపం తెప్పిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

ప్రజలకు ఎలాంటి సమయంలో ఆపద వచ్చినా.. వెంటనే స్పందించేలా డయల్‌ 100 నెంబర్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ నెంబర్ కు కాల్ చేసి.. కొంతమంది మిస్ యూజ్ చేస్తున్నారు. ఎంతో విలువైన పోలీసుల సమయాన్ని వృథా చేస్తున్నారు. అయితే కాల్ చేసి.. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతున్నారు. వికారాబాద్‌ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. ఆదివారం రాత్రి నైట్ దౌల్తాబాద్‌ మండలం గోకఫసల్వాడ్ గ్రామం నుంచి డయల్ 100 నెంబర్‌కు కాల్ వచ్చింది. ఎమర్జెన్సీ సర్వీస్ కావాలని.. తనను బతికించాలని అవతలి వ్యక్తి వేడుకున్నాడు. అత్యవసరం అనుకుని.. అర్ధరాత్రి 2 గంటలకు పోలీసులు వెళ్లారు. అయితే ఆ వ్యక్తికి ఏం సేవ కావాలో విని ఆశ్చర్యపోయారు.

అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులు ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. జీపీఎస్‌ ద్వారా లొకేషన్ ట్రేస్ చేశారు. వెంటనే.. అతని ఇంటి దగ్గరకు వెళ్లారు. తనకు అర్జెంటుగా రెండు బీర్‌ బాటిల్స్ కావాలని తెచ్చిస్తారా అని పోలీసులను అడిగాడు. దీంతో పోలీసులకు కోపం వచ్చింది. ఎమర్జెన్సీ నెంబర్‌కి కాల్ చేసి బీర్‌ బాటిల్స్ తీసుకురమ్మనడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీర్ బాటిల్స్ తెమ్మని అడిగిన వ్యక్తి పేరు జనిగెల మధుగా గుర్తించారు. డ్యూటీలో ఉన్న పోలీసుల అమూల్యమైన సమయాన్ని వృథా చేశాడు. ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఏర్పాటు చేసిన డయల్‌ 100నెంబర్‌ని దుర్వినియోగం చేసినందుకు అతడిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

తదుపరి వ్యాసం