తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ou: ఆగస్టులో ఓయూ పీహెచ్‌డీ నోటిఫికేషన్…!

OU: ఆగస్టులో ఓయూ పీహెచ్‌డీ నోటిఫికేషన్…!

HT Telugu Desk HT Telugu

24 July 2022, 13:25 IST

google News
    • osmania university: వచ్చే నెలలో ఉస్మానియా వర్శిటీ పీహెచ్డీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓయూ పీహెచ్‌డీ నోటిఫికేషన్
ఓయూ పీహెచ్‌డీ నోటిఫికేషన్ (twitter)

ఓయూ పీహెచ్‌డీ నోటిఫికేషన్

osmania university phd admissions 2022: ఓయూ పరిధిలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు త్వరలోనే గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న పీహెచ్డీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు వర్శిటీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 1న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తేదీ కాకపోయినప్పటికీ.. వచ్చే నెలలో పీహెచ్డీ ప్రవేశాల ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది.

వర్శిటీ పరిధిలోని అన్ని డిపార్ట్ మెంట్లలో కలిపి దాదాపు 500 వరకు పీహెచ్డీ సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈసారి పీహెచ్డీ ప్రవేశాల సమయంలో నిర్వహించే ఇంటర్వూల విషయంలో కూడా అధికారులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంటర్వూలను రద్దు చేసి కేవలం నెట్, సెట్, ప్రవేశ పరీక్షల వచ్చే మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయించాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వస్తే... ఏ విధంగా సీట్లు కేటాయిస్తారనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది.

తదుపరి వ్యాసం