తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ou Phd Entrance Results: ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

OU Phd Entrance Results: ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu

20 January 2023, 6:56 IST

    • osmania university updates:  ఓయూ వర్శిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ ఫలితాలు వచ్చేశాయ్. గురువారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 1508 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ ఫలితాలు,
ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ ఫలితాలు,

ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ ఫలితాలు,

osmania university phd results 2022: పీహెచ్డీ ఎంట్రెన్స్ కి సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఈ మేరకు వర్శిటీ వీసీ రవీదర్ యాదవ్ గరువారం ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 9 వేల776 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు హాజరైన 6 వేల 656 మందిలో 1508 మంది అంటే 22.66 శాతం అర్హత సాధించారు.

ట్రెండింగ్ వార్తలు

Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

19 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

TS ECET 2024 Results : రేపు తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు...

అభ్యర్థులు మొదటగా యూనివర్శిటీ అధికారిక వెబ్ సైట్ www.osmania.ac.in ను సందర్శించాలి.

DOWNLOAD OU.Ph.D. - 2022 RANKCARD అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

హాల్ టికెట్ నెంబర్, Registration Number తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.

view rank card పై క్లిక్ చేయాలి మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

డౌన్లోడ్ లేదా ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ ర్యాంక్ కార్డు పొందవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు తప్పనిసరి,

వ్యక్తిగత ర్యాంకుల కోసం యూనివర్శిటీ అధికారిక వెబ్ సైట్ www.osmania.ac.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని, పోస్ట్ ద్వారా ఎలాంటి ర్యాంక్ కార్డులు పంపబడవని వీసీ రవిందర్ స్పష్టం చేశారు.

OU Phd Entrance : ఉస్మానియా యూనివర్శిటీలో పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదలైంది. పిహెచ్‌ ఎంట్రన్స్‌ టెస్‌ 2022 ద్వారా ప్రవేశాలను కల్పిస్తారు. ఆర్ట్స్‌, కామర్స్‌, ఎడ్యుకేషన్‌, ఇంజనీరింగ్‌, ఇన్ఫర్మాటిక్స్‌, లా, ఒరియంటల్ లాంగ్వేజెస్‌, సోషల్ సైన్సెస్‌, టెక్నాలజీ విభాగాల్లోని పలు కోర్సుల్లో పిహెచ్‌డి కోర్సులకు ప్రవేశపరీక్ష ద్వారా అడ్మిషన్లను కల్పిస్తారు.అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్‌గా గుర్తిస్తారు. ఓసీ అభ్యర్ధులకు కనీసం 35మార్కులు రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌ క్యాటగిరీలలో 32 మార్కులు రావాల్సి ఉంటుంది. 47 సబ్జెక్టుల్లో ప్రవేశాల కోసం డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

తదుపరి వ్యాసం