తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadrachalam Online: భద్రాచలంలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభం..

Bhadrachalam Online: భద్రాచలంలో ఆన్‌లైన్ సేవలు ప్రారంభం..

HT Telugu Desk HT Telugu

05 July 2023, 8:34 IST

google News
    • Bhadrachalam Online: భద్రాచలంలో భక్తులకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్ధం ఆర్జిత సేవల్ని ఇకపై ఆన్‌లైన్‌లో  బుక్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రవేశపెట్టారు. 
ఆన్‌లైన్‌లో భద్రాచల సేవలు ప్రారంభం
ఆన్‌లైన్‌లో భద్రాచల సేవలు ప్రారంభం

ఆన్‌లైన్‌లో భద్రాచల సేవలు ప్రారంభం

Bhadrachalam Online: భద్రాచల రామాలయంలో భక్తులకు లభించే సేవల్ని ఆన్‌లైన్‌‌లో అందుబాటులోకి తీసుకు వచ్చారు. భద్రాచల రామాలయం ఆన్‌లైన్‌ సేవలను ఈవో రమాదేవి మంగళవారం ప్రారంభించారు. భక్తులు భద్రాచలంలో లభించే అన్ని రకరాల సేవలను https://bhadradritemple.telangana.gov.in ద్వారా పొందవచ్చు.

ఆలయ అధికారిక వెబ్‌సైట్‌లో నిత్య కల్యాణం, అభిషేకం, అర్చన, దర్శనం, సుప్రభాతం, పవళింపు, తులాభారం, వేదాశీర్వచనం, పట్టాభిషేకం, రథసేవలు వంటి టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని ఈవో తెలిపారు.

ఆలయ సేవల్ని ఆన్‌లైన్‌ ఇవ్వడానికిఅవసరమైన శిక్షణ సిబ్బందికి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భద్రాచలం దర్శనాలకు వచ్చే భక్తులు ఇకపై వసతి సదుపాయాన్ని ఆన్‌లైన్‌‌లో బుక్ చేయాల్సి ఉందని వివరించారు. నేరుగా ఆలయానికి వచ్చే భక్తులు పాత విధానంలోనే రసీదులు తీసుకోవాలన్నారు.

తొలి ఆన్‌లైన్‌ టికెట్‌ వెండి రథసేవను ఏఈవో భవానిరామకృష్ణారావు రూ.1,116 చెల్లించి బుక్‌ చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేదపండితులు పాల్గొన్నారు.

తదుపరి వ్యాసం