Hyderabad Onion Prices : మండుతున్న ఉల్లి ధరలు.....హైదరాబాద్ లో కేజీ ధర ఎంతంటే?
30 October 2023, 15:00 IST
- Onion Prices hike in Hyderabad: ఉల్లి ధరలు మండుతున్నాయి. పెరుగుతున్న ఉల్లి ధరను చూసి సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ ఉల్లి ధర రూ.80 ఉండగా హోల్ సేల్ దుకాణాల్లో రూ.60-70 వరకు పలుకుతుంది.
హైదరాబాద్ లో ఉల్లి ధరలు
Onion Prices hike in Hyderabad : ఉల్లి ధరలు దేశ వ్యాప్తంగా పెరిగిపోయాయి.మొన్నటి వరకు కేజీ టమాటా రూ.200 వరకు పలకడంతో మధ్య తరగతి ప్రజలేవ్వరూ టమాటా లను కొనే దైర్యం చెయ్యలేదు.వాటి కోసం దొంగతనాలు, హత్యలు జరగడం కూడా ఇటీవలే కాలంలో చూశాం.అయితే ఇప్పుడు ఉల్లి ధర కూడా అదే రీతిలో ముందుకు సాగుతుంది.
సాధారణంగా ఉల్లిని కోస్తే కన్నీళ్లు వస్తాయి కానీ ఇప్పుడు ఉల్లి ధరను చూసినా కన్నీల్లే వస్తున్నాయి.తెలంగాణలో పెరుగుతున్న ఉల్లి ధరను చూసి సామాన్యులు బెంబలెత్తిపోతున్నారు నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధర రెండు సార్లు పెరిగింది.ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ ఉల్లి ధర రూ.80 ఉండగా హోల్సేల్ దుకాణాల్లో రూ.60-70 వరకు పలుకుతుంది.అయితే చిన్న వ్యాపారులు మాత్రం రూ.80-85 మధ్య విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే కేజీ ఉల్లి ధర రూ.20 వరకు పలికేది కానీ ఇప్పుడు 100 రూపాయిలు పెడితే కేవలం ఒక కేజి మాత్రమే వస్తుండటంతో జనం ఉల్లిని కొనేందుకు భయపడుతున్నారు.అయితే ఎలాంటి వంటల్లో అయిన అన్నిటికన్నా ఎక్కువగా వాడేది ఒక్క ఉల్లి మాత్రమే కనుక తప్పని పరిస్థితుల్లో అరకేజి,పావుకేజీ ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు సామాన్య ప్రజలు.
ఉల్లి ధర పెరగడానికి కారణాలు..
ఈసారి ఋతుపవనాలు ఆలస్యంగా రావడంతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని వ్యవసాయ రంగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.వర్షాభావ పరిస్థితులు ఉల్లి పంట పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు.వర్షాలు లేక కొత్త ఉల్లి పంటలు ఆగిపోయాయని ,మార్కెట్ లో కొత్త ఉల్లి లేనందున ప్రస్తుతం ఉన్న ఉల్లి ధర గణనీయంగా పెరిగింది అని చెబుతున్నారు నిపుణులు.
అయితే వర్షాకాలంలో కర్ణాటక రాష్ట్ర రైతులు ఉల్లిని భాగా పండిస్తారు అక్కడ నుండి తెలంగాణ కు సరఫరా చేస్తూ ఉంటారు.గత కొన్ని సంవత్సరాలుగా సకాలంలో వర్షాలు పడకపోవడంతో క్షేత్ర స్థాయిలో అటు కర్ణాటక ,ఇటు తెలంగాణ రైతు లేవ్వరు ఉల్లి సాగు కు ఆసక్తి చూపడం లేదు.ఈ క్రమంలోనే ఉల్లిని మహారాష్ట్ర నుండి కొనుగోలు చేస్తున్నారు.దీపావళి పండుగ వరకు ఇవే ధరలు కొనసాగుతాయని అంటున్నారు నిపుణులు.రానున్న రోజుల్లో కేజీ ఉల్లి ధర రూ.100 దాటిన ఆశ్చర్యపోన్నకర్లేదు అని నిపుణులు చెబుతున్నారు.
రిపోర్టర్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
టాపిక్