Hyderabad Onion Prices : హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.....రూ. 25 లకే కిలో ఉల్లి
05 November 2023, 12:13 IST
- Onion Prices in Hyderabad: ఉల్లి ధరల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రిటైల్ ఔట్లెట్లను ఏర్పాటు చేసి సబ్సిడీ కింద రూ.25 లకే కేజీ ఉల్లిని విక్రయించనునట్లు తెలిపింది.
హైదరాబాద్ లో ఉల్లి ధరలు
Onion Prices in Hyderabad: దేశంలో ఉల్లి ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కల్పించే దిశగా చర్యలు తీసుకుంటుంది.ఆ చర్యల్లో భాగంగా రిటైల్ ఔట్లెట్లను ఏర్పాటు చేసి సబ్సిడీ కింద రూ.25 లకే కేజీ ఉల్లిని విక్రయించనునట్లు వినయోగుదరులు,వ్యవహారాల,ఆహార పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.సకాలంలో వర్షాలు లేక ఖరీఫ్ పంటకు ఆలస్యం అవ్వడం వల్ల దేశంలో ఉల్లి కొరత ఏర్పడి ధర పెరుగుతుందన్న కేంద్రం ఈ మేరకు చర్యలు ఉపక్రమించింది.
5.06 లక్షల టన్నుల ఉల్లి సేకరణ
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతుంది.దీంతో ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా తక్కువ ధరకే ఉల్లిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.అందుకోసం బఫర్ స్టాక్ కింద కేంద్రం 5.06 లక్షల టన్నుల ఉల్లిని కేంద్రం సేకరించింది.వీటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు వినయోగుదరులు వ్యవహారాల ఆహార పౌర సరఫరా శాఖలు సంయుక్తంగా రిటైల్ ఔట్లెట్లు ,మొబైల్ వ్యన్ ల ద్వారా అమ్మకాలను ప్రారంభించింది. నేషనల్ కోఆప్రేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ,నేషనల్ అగ్రికల్చర్ కోఆప్రేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సంస్థలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాయి.ఈ సహకార సంస్థల ద్వారా కిలో ఉల్లి రూ.25 లకే లభిస్తుంది.ఇప్పటికే జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సహకార సంస్థ 21 రాష్ట్రాల్లో 329 రిటైల్ పాయింట్లు,మొబైల్ వ్యాన్ లను ఏర్పాటు చేసి విక్రయిస్తుంది.
హైదరాబాద్ లో రూ.25 లకే కిలో ఉల్లి
దీంతో పాటు జాతీయ వినియోగదారుల సహకార సంస్థ కూడా 20 రాష్ట్రాల్లో రిటైల్ సెంటర్లను ప్రారంభించింది.దక్షణాది రాష్ట్రాల్లో హైదరాబాద్ ప్రజలకు ఉల్లిని రిటైల్ లో విక్రయించేందుకు హైదరాబాద్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ అసోసియేషన్ సంస్థ రిటైల్ పాయింట్లను ఏర్పాటు చేస్తుంది.హైదరాబాద్ లో ఉల్లి ధరలు తగ్గే వరకు రాయితీ తో రూ.25 లకే విక్రయించనునట్లు కేంద్రం తెలిపింది.దేశ వ్యాప్తంగా ఇప్పటికే 5.06 లక్షల టన్నుల ఉల్లిని సేకరించిన కేంద్రం ఇంకా సేకరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించింది.