తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Health Department Jobs : 1,326 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..

Health Department Jobs : 1,326 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..

HT Telugu Desk HT Telugu

15 June 2022, 19:47 IST

    • తెలంగాణ‌లో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా వైద్యారోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయనుంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. తాజాగా వైద్యారోగ్య శాఖలో నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. దీని ద్వారా.. 1326 పోస్టులను భర్తీ చేయనున్నారు. వైద్యారోగ్య శాఖ‌లో 1,326 సివిల్ అసిస్టెంట్ సర్జన్, ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నోటిఫికేష‌న్ ద‌ర‌ఖాస్తు వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ ను సంద‌ర్శించాలి. దాని కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వ‌య‌సు 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. దరఖాస్తు ప్రారంభం... జులై 15 నుంచి జూన్ 14 చివరి తేదీ వరకూ ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

TS LAWCET 2024 Updates : తెలంగాణ లాసెట్ ప్రవేశాలు - తక్కువ ఫైన్ తో దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

Siddipet District : పగటిపూట బట్టల అమ్మకం, రాత్రివేళ చోరీలు - చివరికి ఇలా దొరికిపోయాడు..!

Telangana Tourism : బీచ్ పల్లి టెంపుల్, జోగులాంబ శక్తి పీఠం దర్శనం - రూ. 1500కే స్పెషల్ టూర్ ప్యాకేజీ

TS TET 2024 Updates : అలర్ట్... మే 15 నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు, డౌన్లోడ్ లింక్ ఇదే

సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పబ్లిక్ హెల్త్) 751 పోస్టులు ఉన్నాయి. జీతం రూ.58,850-రూ.1,37,050 వరకూ ఉంటుంది. ట్యూటర్ 357 ఖాళీలు ఉండగా.. రూ.57,700-రూ.1,82,400 వరకూ ఉండనుంది. ఇక సివిల్ అసిస్టెంట్ సర్జన్ (వైద్య విధాన పరిషత్) పోస్టుల విషయానికొస్తే.. 211 ఉన్నాయి. రూ.58,850-రూ.1,37,050 మధ్య జీతం ఉంటుంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ప్రివెంటీవ్ మెడిసిన్) పోస్టులు 7 ఉండగా.. జీతం రూ.58,850-రూ.1,37,050 నడుమ ఇస్తారు.

ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించాలి. తెలంగాణ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లాలి. నోటిఫికేష‌న్ వివ‌రాలు పూర్తిగా చూసుకోండి. అభ్యర్థులు.. రూ.200 ద‌ర‌ఖాస్తు రుసుం చెల్లించాలి.

తెలంగాణ‌లో వ‌రుస‌గా ఉద్యోగాల నోటిఫికేష‌న్లు విడుదల అవుతున్నాయి. పోలీస్‌, గ్రూప్‌-1 రిక్రూట్ మెంట్ ప్రాసెస్ నడుస్తోంది. తాజాగా వైద్యారోగ్య శాఖలో కూడా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మంత్రి హరీశ్ రావు వైద్య ఆరోగ్య శాఖ‌ లో 1,326 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ త్వరలో విడుదల చేయనున్నట్టుగా ఇటీవలే ప్రకటించారు. దీనిపై అధికారులతో చర్చించారు.

రిక్రూట్ మెంట్ క్యాలెండర్

తాజాగా మంత్రి హరీశ్ రావు రిక్రూట్ మెంట్ క్యాలెండర్ పై మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూసే వారికి మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వార్షిక రిక్రూట్‌మెంట్ క్యాలెండర్‌ను రూపొందిస్తుందని వెల్లడించారు. ఎన్ని ఖాళీలు వస్తాయో స్పష్టంగా తెలిపే రిక్రూట్‌మెంట్ క్యాలెండర్‌ను సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఒక్కో సంవత్సరంలో ఒక్కో విభాగంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయో అభ్యర్థులు తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీని ప్రకారం, ఉద్యోగాలకు ఆశించేవారు.. తమ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకోవచ్చని చెప్పారు.

టాపిక్