HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kv Jobs Recruitment 2024 : తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. ఇలా అప్లై చేయండి!

KV Jobs Recruitment 2024 : తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. ఇలా అప్లై చేయండి!

16 September 2024, 19:00 IST

    • KV Jobs Recruitment 2024 : తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు. సెప్టెంబర్ 18వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు కేంద్రీయ విద్యాలయం అధికారులు వెల్లడించారు.
కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు
కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు (kendriya vidyalaya)

కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు

తెలంగాణలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు అప్లికేషన్ ఫామ్ నింపి ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ సెల్ఫ్ అట్టేస్టెడ్ జిరాక్స్ కాఫీలు, ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోతో ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చని అధికారులు వివరించారు. ఈ ఉద్యోగాలను పార్ట్ టైం, కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

ముఖ్యమైన అంశాలు..

1. హైదరాబాద్‌లోని ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.

2. టీజీటీ (ఇంగ్లీష్) , టీజీటీ (సోషల్ సైన్స్) , టీజీటీ (మ్యాథమెటిక్స్), ఎడ్యుకేషన్ కౌన్సిలర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

3. ఇంటర్వ్యూ ద్వారా నియామకం జరగనుంది. దీనికి హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు.

4. 18-09-2024 తేదీన ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఇంటర్వ్యూకు హాజరుకావాలి. అధికారులు వివరాలు నమోదు చేసుకొని పిలుస్తారు.

5. అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

6. 18వ తేదీ వచ్చిన అభ్యర్థులను.. తొలుత ఇంటర్వ్యూ చేస్తారు. ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

7. కేంద్రీయ విద్యాలయాల నిబంధనల ప్రకారం జీతం ఇస్తారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్