Adilabad Protests: ఆదిలాబాద్‌లో ఆగని నిరసనలు, పోలీసులను అడ్డుకున్న గ్రామస్తులు, కొనసాగుతున్న ఆందోళనలు
27 November 2024, 14:51 IST
- Adilabad Protests: ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లా దిలావర్పూర్‌లో రైతులను, నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో గ్రామస్థులు తీవ్రంగా ఆగ్రహించారు. దీంతో గ్రామస్థులంతా మూకుమ్మడిగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి రోడ్లపై నిరసన తెలిపారు.
దిలవర్పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన
Adilabad Protests: ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గ్రామంలోని ప్రధాన కూడలిలా వద్ద పోలీసు బలగాలు పహారా కాస్తున్నా లెక్క చేయకుండా వందల సంఖ్యలో గ్రామస్థులు ర్యాలీగా రోడ్ల పైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దిలావర్పూర్ మండల కేంద్రం పరిధిలో చేపట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని బుధవారం రెండవ రోజు సైతం జేఏసీ ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో దిలావర్పూర్ మండల కేంద్రంలో యువకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసేందుకు వెళ్లారు. గ్రామస్తులు, మహిళలు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. గ్రామస్తులకు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్ని అక్రమ అరెస్టులు జరిగిన ఆందోళన ఆపేది లేదన్నారు.
గుండంపల్లి గ్రామాల మధ్య నెలకొల్పనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ మా కొద్దు అని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తూ ఆయా గ్రామాల రైతులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష లు నేటికీ వందరోజులు కావస్తుంది.
తమ ప్రాంతంలో పరిశ్రమ వద్దoటూ మండల ప్రజలు గత వంద ఇరవై రోజులు గా వివిధ రకాల నిరసనలు, ఆందోళన లు కొనసాగిస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటికి గ్రామస్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కలిసి సమస్యను వివరించారు. ప్రజారోగ్యన్ని దెబ్బతీసే పరిశ్రమను ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏర్పాటు చేయడం భావ్యం కాదని, వ్యవసాయం పని ఆధారపడి ఉన్న ఈ ప్రాంతంలో రైతులకు జీవనోపాధి లేకుండా ఫ్యాక్టరీ నిర్మించడం సమంజసం కాదని హెచ్చరిస్తున్నారు.
గత శాసనసభ ఎన్నికలకు ముందు ప్రస్తుత పాలకులు , ఎన్నో హామీలు ఇచ్చి నిర్మాణ పనులు నిలిపివేసి, కొద్దిరోజులుగా మళ్లీ తిరిగి ప్రారంభించడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇతనాల్ పరిశ్రమ ఏర్పాటైతే భావితరాలకు ఇబ్బందులు తప్పవని మండలం లోని ప్రతీ రైతు దీక్షలో పాల్గొని 120రోజులుగా నిరసన చేస్తున్నారు.
జిల్లా ఎస్పీ, ఆర్డీఓ వాహనాలను సైతం వెనక్కి పంపించి నిరసన తెలుపుతున్నారు. రోడ్డు పైనే వంట వార్పు చేసుకుని నిరసన కొనసాగిస్తున్నారు. పాలకులు అధికారులతో కలిసి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు నిరసన కార్యక్రమం తెలుపుతూమంటున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకొని అక్రమ కేసులు బనాయించారని, అరెస్టు చేయడానికి వస్తే తాము వెనక్కి పంపించేశామని తెలిపారు.
రెండో రోజు సైతం రోడ్డుపైన వంట వార్పు చేసుకోవడంతో నిర్మల్ బాసర రహదారి పూర్తిగా శ్రమించిపోయింది. ఒక క్రమంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు ఏ క్షణాన లాఠీచార్జి చేస్తారోనని మరికొందరు అంచనాలు వేస్తున్నారు. ఏది ఏమైనా తమ ప్రాణాలు పోయిన పట్టించుకోబామని, వంద రోజులు పైగా మేము శాంతియుతంగా ప్రభుత్వపై ఒత్తిడి తెస్తుంటే పాలకులు అధికారులు నిర్లక్ష్యం వహించి ఇంతటి నిరసనకు కారకులయ్యారని వారు పేర్కొన్నారు.
(రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడిదలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)