తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Niti Aayog: కేసీఆర్ వ్యాఖ్యలకు నీతి ఆయోగ్ కౌంటర్… ఏం చెప్పిందంటే

NITI Aayog: కేసీఆర్ వ్యాఖ్యలకు నీతి ఆయోగ్ కౌంటర్… ఏం చెప్పిందంటే

06 August 2022, 19:52 IST

google News
    • తెలంగాణ సీఎం కేసీఆర్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై నీతి ఆయోగ్ స్పందించింది. సమావేశాన్ని బహిష్కరించడం దురదృష్టకరమని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పలు అంశాలను ప్రస్తావించింది.
కేసీఆర్ వ్యాఖ్యలకు నీతి ఆయోగ్ సమాధానం
కేసీఆర్ వ్యాఖ్యలకు నీతి ఆయోగ్ సమాధానం (twitter)

కేసీఆర్ వ్యాఖ్యలకు నీతి ఆయోగ్ సమాధానం

niti ayog on cm kcr comments: నీతి ఆయోగ్ సమావేశాలతో ఏం సాధించారంటూ కేంద్రాన్ని తీవ్రంగా ప్రశ్నించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆదివారం ఢిల్లీలో తలపెట్టిన నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. ఈ క్రమంలో నీతి ఆయోగ్ సమావేశాల్లో పల్లీలు తింటూ సమయాన్ని వ్యర్థం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. కనీసం రాష్ట్రాలు చేసే సిఫార్సులను కూడా పట్టించుకోవడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా కేసీఆర్ మీడియా సమావేశం ముగిసిందో లేదో... వెంటనే నీతి ఆయోగ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించింది.

అజెండా రూపకల్పనలో రాష్ట్రాల వాటా లేదంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని కౌంటర్ ఇచ్చింది. పీఎంకేఎస్ వై - ఏబీపీ స్కీం కింద తెలంగాణకు రూ. 1195 విడుదల చేసినట్లు ప్రకటించింది. సమాఖ్య స్పూర్తి కోసమే నీతి ఆయోగ్ ఏర్పాటు చేశారని తెలిపింది. గత నెల 7వ తేదీన నిర్వహించిన సన్నాహక సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతినిధుల హాజరయ్యారని స్పష్టం చేసింది. జలజీవన్ మిషన్ కింద కూడా కింద రూ. 3982 కోట్ల కేటాయించినప్పటికీ... కానీ తెలంగాణ 200 కోట్ల మాత్రం ఉపసంహరించుకుంది.గతేడాదిలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 30 సమావేశాలను నిర్వహించిందని తెలిపింది. జనవరి 21, 2021న తెలంగాణ సీఎంతో నీతి ఆయోగ్ ప్రతినిధులు కూడా భేటీ అయి పలు అంశాలపై చర్చించారని చెప్పింది. తర్వాత పలు సమావేశాలను ప్రతిపాదించినప్పటికీ సీఎం కేసీఆర్ స్పందించలేదని స్పష్టం చేసింది.

Revanth reddy fires on cm kcr: మరోవైపు సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కిరించడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రధాని మోదీ, కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉందని మరోసారి నిరూపితమైందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో ప్రధానిని నేరుగా ప్రశ్నించే అవకాశం వచ్చినప్పటికీ... కేసీఆర్ ఎందుకు వినియోగించుకోవటం లేదన్నారు. సమావేశానికి హాజరై పునరాలోచించాలని కోరారు.

మొత్తంగా నీతి ఆయోగ్ సమావేశంపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటం… నిమిషాల వ్యవధిలోనే నీతి ఆయోగ్ కూడా వెంటనే ప్రకటన ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.

తదుపరి వ్యాసం