Nirmal Handicrafts : ప్రపంచ నలుమూలలకు నిర్మల్ కొయ్య బొమ్మలు
04 February 2024, 10:31 IST
- Nirmal Handicrafts News: నిర్మల్ కొయ్య బొమ్మలు ప్రపంచం నలమూలలకు చేరుతున్నాయి. ఆన్ లైన్ దిగ్గజం ఆమెజాన్ లోనూ ఈ బొమ్మలను అందుబాటులో ఉంచేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఫలితంగా కొయ్య బొమ్మలు తయారీ చేస్తున్న వారికి ఈ రూపంలో ఓ భరోసా దొరికింది.
నిర్మల్ చేతి బొమ్మలు
Nirmal Handicrafts : నిర్మల్ కొయ్య బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి, మిషన్లు లేకుండానే హస్తకళలో నైపుణ్యంతో తయారుచేసే కొయ్య బొమ్మలు ఎంతో డిమాండ్ ఉన్నాయి, సుమారు 400 ఏళ్ల చరిత్ర గల కొయ్య బొమ్మల తయారీ పరిశ్రమకు ఆదరణ లేక కుంటపడుతుందని స్థానిక కళాకారులు వాపోతున్నారు. సుమారు 17వ శతాబ్దంలో నిర్మల్ రాజ్యాన్ని పరిపాలించిన నిర్మల నాయుడు ఈరోజు దేశ నలుమూలల నుండి విద కళాకారులను రప్పించి స్థానికంగా రాజ్యంలో ఎన్నో నిర్మాణాలు చేశారు, అందులో భాగంగా వచ్చిన వారే నకశీలు. ఈ నాకాశి అనే కుల వృత్తుల వారు స్థానికంగా లభించే పోనికి కర్రతో వివిధ కళాఖండాలు తయారు చేసేవారు. ఈ కలనఖండాలను చూసిన నిమ్మల రాజు మంత్రముగ్దలై వారికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. వారి కలం ప్రోత్సహించారు. అప్పటినుండి వారి హస్త గల నైపుణ్యం వివిధ ప్రదేశాలకు పాకింది, 1955లో పారిశ్రామిక సంఘంగా ఏర్పడి కళాఖండాలను వివిధ ప్రదేశాలకు పంపిస్తు ఉపాధి పొందుతున్నారు.
పొనికి కర్ర కొరత :
ఇంతటి ప్రసిద్ధిగాంచిన కళాఖండాలు తయారు చేయడానికి పునికి కర్ర కొరతగా మారుతుంది. అదిలాబాద్ జిల్లా లభించే పొణికి కర్రను , చింత గింజల పొడిని ఈ కళాఖండాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు, అయితే ప్రస్తుతం అడవుల్లో ఆ చెట్లు తగ్గిపోవడంతో కర్ర లభించడం లేదని స్థానిక కళాకారులు చెబుతున్నారు. ఒక్కోసారి తామే స్వయంగా అడవుల్లో చెట్లను వెతికి అటవీ శాఖ వారికి సమాచారం ఇచ్చి టెండర్ ద్వారా కొనుగోలు చేసుకుంటున్నామన్నారు. ఇంతటి డిమాండ్ కలిగిన కర్రను అటవీ మైదాన ప్రాంతాల్లో ప్లాంటేషన్ల ద్వారా పెంచేందుకు అటవీ శాఖ గత మూడు సంవత్సరాల క్రితం కసరత్తు ప్రారంభించింది. నిర్మల్ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అటవీ శాఖ సిసిఎఫ్ శరవనన్ లు పొనికి చెట్లను పెంచుటకు విశేషంగా కృషి చేస్తున్నారు.
ఈ తరం దాటితే గడ్డు పరిస్థితే...!
ఇంతటి చరిత్ర కలిగిన కొయ్య బొమ్మల తయారీ కేంద్రం పరిస్థితి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని స్థానిక కళాకారులు వాపోతున్నారు. అప్పటి పరిస్థితిని వారిని జీవించుకోలేకపోతున్నారు. స్వయంగా కేవలం చేతుల ద్వారా ఎలాంటి మెషిన్లు ఉపయోగించకుండా చేసే కళా వృత్తి తమ వరకే ఉంటుందనే విషయం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాఖండాలు తయారు చేయడానికి తమ పిల్లలు ఈ వృత్తిని నేర్చుకోలేకపోతున్నారని, ఉన్నత చదువులకు, ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారని, ఈ వృత్తి తాము ఉన్నంత వరకే ఉంటుందా అని బయపడుతున్నారు. గతంలో సుమారు 200 మందికి పైగా కుటుంబాలు ఈ వృత్తిని చేపట్టేవారని ప్రస్తుతం పదుల సంఖ్యకు చేరిందని చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే ఇంకొక 10 నుండి 15 సంవత్సరాలు ఈ వృత్తి కొనసాగే అవకాశం ఉందంటున్నారు.
అమెజాన్లో నిర్మల్ కొయ్య బొమ్మలు :
నూటికి నూరు శాతం చేతులతో తయారుచేసే ఈ కొయ్య బొమ్మలలో తయారు చేయబడిన వస్తువు అంటూ లేదు, తినే పాన్ పోక చెక్కలు, రక రకాల పక్షులు, అనేక రకాల జంతువులు, వర్ణ చిత్రాలు, దేవుళ్ళ చిత్రపటాలు, వాల్ పెయింటింగ్స్ ఎన్నో వందలాది రకాల వస్తువులు తయారు చేస్తారు, వీటన్నిటికీ కూడా పోనికి కర్ర, సహజ రంగులనే వాడుతారు. ఇలాంటి చిత్రాలు ప్రపంచ ఆదరణ పొందడంతో అమెజాన్లో కొనుగోలు చేసుకోవడానికి స్థానిక కలెక్టర్ చర్యలు చేపట్టారు, వాటి పార్సిలను ప్రత్యేక కర్ర బాక్సులలో సప్లై చేయడానికి మహిళా సంఘాలకు శిక్షణ ఇస్తున్నారు, ఏదేమైనా 400 ఏళ్ల చరిత్ర గల నిర్మల్ కొయ్య బొమ్మల కలను బ్రతికించడానికి అధికారులు మరిన్ని విస్తృత చర్యలు చేపట్టాల్సి ఉంది. స్థానికంగా పాలకులకు అధికారులకు శుభకార్యాలకు శాలువాలు పూలమాలలు కాకుండా నిర్మల్ కొయ్య బొమ్మలతో సత్కరించడానికి ఏర్పాట్లు చేస్తే, కొయ్య బొమ్మల పారిశ్రామిక కేంద్రం మరింత అభివృద్ధి చెందుతుందని నిర్మల్ యూనిట్ మానేజర్ బీ.ఆర్. శంకర్ తెలుపుతున్నారు. హస్తకళ మాతోనే సమాప్తం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం కనీస వేతనం చెల్లించి వంశపారంపర్యంగా వచ్చేకలను ఆదుకోవాలని అంటున్నారు. ప్రభుత్వం ద్వారా హెల్త్ కార్డు, పిల్లల చదువుల్లో రాయితీ, బ్యాంకు రుణాలు, ప్రత్యేక శిక్షణ తరగతులు, ఉద్యోగ భద్రత లాంటి చర్యలు చేపడితే తమ పిల్లల సైతం కలలు నేర్చుకోవడానికి ముందుకు వస్తారని తెలుపుతున్నాడు.