తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nagole Murder: వీడిన నాగోల్ మర్డర్ మిస్టరీ.. వేధింపులు తాళలేక హతమార్చిన మిత్రులు, ముగ్గురు నిందితుల అరెస్ట్

Nagole Murder: వీడిన నాగోల్ మర్డర్ మిస్టరీ.. వేధింపులు తాళలేక హతమార్చిన మిత్రులు, ముగ్గురు నిందితుల అరెస్ట్

HT Telugu Desk HT Telugu

22 March 2024, 9:13 IST

google News
    • Nagole Murder: నాగోల్‌లో యువకుడు హత్య కేసు మిస్టరీ వీడింది. వేధింపులు తాళలేక  హతుడి స్నేహితులే నేరానికి పాల్పడినట్టు గుర్తించారు. 
నాగోల్ మర్డర్ కేసు విరాలను వెల్లడిస్తున్న పోలీసులు
నాగోల్ మర్డర్ కేసు విరాలను వెల్లడిస్తున్న పోలీసులు

నాగోల్ మర్డర్ కేసు విరాలను వెల్లడిస్తున్న పోలీసులు

Nagole Murder: హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19 న జరిగినహత్య కేసులో మిస్టరీ వీడింది.ఈ కేసులో ముగ్గురు నిందితులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

విలేకర్ల సమావేశంలో ఎల్ బి నగర్ ఏసిపి కృష్ణయ్య మాట్లాడుతూ....కేసు వివరాలను వెల్లడించారు. నాగోల్, ఈశ్వరిపురా కాలనీకి చెందిన దేరంగుల మల్లికార్జున కారు డ్రైవరు గా పని చేస్తున్నాడు.

న్యూ నాగోల్ సమాతి పురా కాలనీకి కొప్పుల అర్జున్ యాదవ్, బొడప్పల్, మణికంఠ నగర్‌ కు చెందిన కంచల ఓంకార్ అహ్మద్ కు చెందిన మల్లెల మహేష్ అతడికి స్నేహితులు.మద్యానికి బానిసైన మల్లికార్జున తరచూ డబ్బుల కోసం వారిని వేధించేవాడు.

డబ్బులు ఇవ్వకపోతే చంపుతానంటూ పలు మార్లు బెదిరించాడు. ఈ క్రమంలోనే గతంలో ఒకసారి ఓం కార్ పై మల్లికార్జున కత్తితో దాడి కూడా చేశాడు.ఎప్పటికైనా మల్లిఖార్జున్ తో తమకు ముప్పు తప్పదని భావించిన ముగ్గురు స్నేహితులు మల్లికార్జున ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు.

పక్కా పథకం ప్రకారం.....హత్య

ఇదిలా ఉంటే ఈనెల 18న మల్లికార్జున అర్జున్ యాదవ్ ఇంటికి వెళ్లి మద్యం కోసం డబ్బులు కావాలని వారి కుటుంబ సభ్యులతో గొడవకి దిగాడు. అదే రోజు రాత్రి మహేష్ తో కలిసి మద్యం సేవించిన మల్లిఖార్జున మహేష్ పై కత్తితో దాడి చేశాడు.

దీంతో అతడిని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నా అర్జున్ యాదవ్, మహేష్ మరియు ఓం కార్.....ఈనెల 19 న ఉదయం రామంత పూర్ లోని ఓ బార్ లో కలుసుకున్నారు. మల్లికార్జున్ తన మిత్రుడైన అజయ్ తో కలిసి లాకినర్షిహ కాలనీలో మద్యం తాగుతున్నట్టు గుర్తించిన ముగ్గురు అక్కడికి వెళ్ళారు.

అదే సమయంలో అజయ్ మద్యం తెచ్చేందుకు బయటకు వెళ్ళారు. మల్లిఖార్జున్ ఒంటరిగ ఉండడాన్ని చూసిన ముగ్గురు స్నేహితులు అతడిపై మూకుమ్మడిగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మల్లికార్జున్ ను పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు.పోస్టుమార్టం నిమిత్తం మృతి దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నిందితులు అరెస్ట్...రిమాండ్ కు తరలింపు

మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం ఆనంద నగర్ చౌరస్తా లో కారులో వెళుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం ఒప్పుకున్నారు. నిందితులు అర్జున్ యాదవ్, ఓంకార్ మరియు మహేష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు వారిపై రౌడీ షెట్ ఓపెన్ చేస్తున్నట్లు ఏసిపి కృష్ణయ్య తెలిపారు.వారి నుంచి ఒక కారు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)

తదుపరి వ్యాసం