తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Statue Of Equality | సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఎంట్రీ టికెట్ ధర ఎంతో తెలుసా?

Statue Of Equality | సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఎంట్రీ టికెట్ ధర ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu

17 February 2022, 13:14 IST

google News
  • ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ముచ్చింతల్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం రూపుదిద్దుకుంటోంది. అయితే సందర్శన కోసం వచ్చే.. భక్తులకు కోసం టికెట్ ధరను నిర్ణయించారు. ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తారు.

సమతామూర్తి కేంద్రం
సమతామూర్తి కేంద్రం (PTI)

సమతామూర్తి కేంద్రం

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఎన్నో ప్రత్యేకతలు. ఇక్కడకు వస్తే.. మనసుకు తెలియని ప్రశాంతత. ఇప్పుడు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుద్దికుంటోంది. 216 అడుగుల సమతామూర్తి విగ్రహం, 120 కేజీల బరువున్న 54 అంగుళాల స్వర్ణమూర్తి విగ్రహం, 108 వైష్ణవ ప్రధాన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. సుమారు.. రూ.1200 కోట్ల వ్యయంతో ఈ క్షేత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు సందర్శనకు వచ్చే వారి కోసం టికెట్ ధరను ప్రకటించారు.

6-12 ఏళ్ల లోపు చిన్నారులకు రూ.75గా టికెట్ ధర నిర్ణయించారు. పెద్దలకు రూ.150గా ప్రవేశ రుసుమును ప్రకటించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా అనుమతి కల్పిస్తారు. ఇంకా ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందుకోసమే.. ఈ నెల 19 వరకూ మధ్యాహ్నం 3 గంటల నుంచి మాత్రమే భక్తులకు ప్రవేశం ఉంటుంది.

19 తర్వాత ఉదయం, సాయంత్రం సమయల్లోనూ.. భక్తులకు ప్రవేశం ఉండనుంది. ప్రస్తుతానికి.. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని 120 కిలోల శ్రీరామానుజచార్యుల స్వర్ణమూర్తి విగ్రహం సందర్శన, త్రీడీ మ్యాపింగ్‌ లేజర్‌ షో, ఫౌంటేన్‌ అందాలను నిలిపివేసినట్టు ఆశ్రమ నిర్వాహకులు చెప్పారు. స్వర్ణమూర్తి విగ్రహం చుట్టూ.. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌ ఫ్రేమ్ ను సైతం ఏర్పాటు చేస్తున్నారు.

దివ్యదేశాలుగా పిలిచే 108 ఆలయాల్లో ఇద్దరు చొప్పున అర్చకులు నియమించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. మిగతా ఆలయాల్లోనూ మరికొంతమందిని నియమిస్తారు. మెుత్తం 250 మంది అర్చకులు ఉంటారు.

అయితే మెుదట టికెట్ ధరను పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.200గా పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కానీ ఇంత ధర అయితే భక్తులకు భారంగా మారుతందని భావించి.. రూ.150కి తగ్గించారు. చిన్నారులకు రూ.75గా నిర్ణయించారు. భద్రతపైనా.. ఇక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో మెుత్తం 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వీటి కోసం ఓ ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఉంటుంది.

ఎవరెవరు లోపలికి వచ్చారు. ఎంత మంది తిరిగి బయటకు వెళ్లారనే.. వివరాలు పకడ్బందీగా తెలిసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా లోపలే ఉంటే.. పూర్తిస్థాయిలో తనిఖీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. మెుత్తం ఈ క్షేత్రం 50 ఎకరాల్లో ఉంది. నిరంతరం పర్యవేక్షించేందుకు 300 మంది సెక్యూరిటీ ఉంటారు. ఫోన్లు, ఇతర బ్యాగేజీని లోపలికి అనుమతించారు. టికెట్‌ కౌంటర్‌ దగ్గరలోనే.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో సెల్‌ఫోన్లు, లగేజీ, పాదరక్షలు పెట్టేలి. ఎంట్రీ దగ్గర ఇచ్చిన వస్తువులు.. కన్వేయర్‌ బెల్టుతో ఎగ్జిట్‌ వరకు వస్తాయి. అక్కడే వాటిని తీసుకోవాలి.

తదుపరి వ్యాసం