తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Congress | తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఫోకస్.. ఎంపీ కోమటిరెడ్డికి కీలక పదవి

Telangana Congress | తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఫోకస్.. ఎంపీ కోమటిరెడ్డికి కీలక పదవి

HT Telugu Desk HT Telugu

10 April 2022, 20:35 IST

google News
    • తెలంగాణ రాజకీయాలపై.. కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే.. కొన్ని రోజుల నుంచి టీపీసీసీలో అంతర్గత పోరు ఉన్న నేపథ్యంలో.. ఎలాగైనా సెట్ చేయాలని.. అధిష్ఠానం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(ఫైల్ ఫొటో)
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(ఫైల్ ఫొటో)

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(ఫైల్ ఫొటో)

తెలంగాణ కాంగ్రెస్ లోని కొంతమంది నేతల్లో ఎప్పుడూ.. అసంతృప్తి కనిపిస్తూనే ఉంటుంది. ఎన్ని బుజ్జగింపులు జరిగినా.. క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నా.. మళ్లీ అదే పాట. అయితే పూర్తిస్థాయిలో తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెడుతోంది. ఎలాగైనా.. సీట్లు పెంచుకోవాలనే ఆలోచనలు ఉంది. పార్టీలో అంతర్గత పోరును తగ్గించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై వి.హనుమంతరావు, జగ్గారెడ్డి సహా మరి కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. అన్ని పక్కనపెట్టి.. పార్టీని ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేయాలని చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి వర్గం రేవంత్ రెడ్డిపై మెుదటి నుంచి అసంతృప్తితోనే ఉంది. అయితే వాటిని లెక్కచేయకుండా రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుని వెళ్తున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశించి.. రాకుండా.. అసహనం వ్యక్తం చేసిన నేతలనూ కలుపుకొని వెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు.. కోమటిరెడ్డికి స్టార్ క్యాంపెయినర్ రావడం కూడా.. రేవంత్ రెడ్డి ప్లాన్ లా కనిపిస్తోంది. సరికొత్త వ్యూహంతో జనాల్లోకి వెళ్లేలా.. టీ కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తున్నట్టు కనిపిస్తోంది. రైతుల సమస్యలపై ఇందిరాపార్క్‌లో దీక్షలోనూ ఇద్దరు నేతలు ఒకే వేదిక మీదకు వచ్చారు.

టాపిక్

తదుపరి వ్యాసం