తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Joginapally Santosh | ఎంపీ సంతోష్‌కుమార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Joginapally Santosh | ఎంపీ సంతోష్‌కుమార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

HT Telugu Desk HT Telugu

07 August 2023, 14:08 IST

google News
    • తెలంగాణలో పచ్చదనం కోసం ఎంతో కృషి చేస్తున్న రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ను ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఛేంజ్‌ అవార్డు వరించింది. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పేరుతో ఆయన మొక్కల పెంపకంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన విషయం తెలిసిందే.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున, నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన సంతోష్ కుమార్ (ఫైల్ ఫొటో)
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున, నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన సంతోష్ కుమార్ (ఫైల్ ఫొటో) (Mohammed Aleemuddin)

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున, నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటిన సంతోష్ కుమార్ (ఫైల్ ఫొటో)

హైదరాబాద్‌: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పేరుతో పచ్చదనం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఛేంజ్‌ అవార్డు ఇచ్చారు. శ తాజ్‌ దక్కన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అయితే అధికారిక కార్యక్రమాల కారణంగా ఆయన ఈ అవార్డు ప్రదానోత్సవానికి రాలేకపోయారు. 

ఆయన తరఫున గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కోఫౌండర్‌ రాఘవ ఈ అవార్డు స్వీకరించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్‌ ఈ అవార్డు అందజేశారు. ప్రతిష్టాత్మక ఐఎఫ్‌ఐఈ (ఇంటరాక్టివ్‌ ఫోరమ్‌ ఆన్‌ ఇండియన్‌ ఎకానమీ) ఈ అవార్డు అందిస్తుంది. తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడంపై సంతోష్‌కుమార్‌ సంతోషం వ్యక్తం చేస్తూ తన సందేశాన్ని పంపించారు.

తదుపరి వ్యాసం