తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rain Alert : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం.. తెలంగాణలోని ఈ జిల్లాలకు అలర్ట్

Hyderabad Rain Alert : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం.. తెలంగాణలోని ఈ జిల్లాలకు అలర్ట్

10 October 2024, 12:59 IST

google News
    • Hyderabad Rain Alert : వచ్చే మూడు గంటల్లో హైదరాబాద్‌లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని తెలిపారు. జనగామ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో వర్షం
హైదరాబాద్‌లో వర్షం

హైదరాబాద్‌లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని.. వాతావరణ విభాగం అధికారులు అంచనా వేశారు. జనగామ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వచ్చే మూడు గంటల్లో హైదరాబాద్‌లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలు కురిసే సమయంలో ఈదులు గాలులు వీస్తాయని హెచ్చరించారు.

ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి లక్షద్వీప్ తో పాటు పక్కనే ఉన్న ఆరేబియా సముద్రం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. దీనికి తోడుగా ఉపరితల ద్రోణి కూడా ఉందని.. ఇది కేరళ మీదుగా సగటు సముద్రమట్టానికి 1 .5 కి.మీ ఎత్తులో విస్తరించి బుధవారం బలహీనపడిందని ఐఎండీ వెల్లడించింది.

ఈ ప్రభావంతో ఏపీలో 2 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో ఇవాళ పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడుతాయని వివరించింది.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

అక్టోబర్ 11వ తేదీన కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబర్ 12 నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.

తదుపరి వ్యాసం