హ్యాపీ బర్త్ డే అన్నయ్య… ఎమ్మెల్సీ కవిత ట్వీట్
24 July 2022, 12:33 IST
- MLC kavitha Tweet: మంత్రి కేటీఆర్ కు సోదరి కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ తో ఉన్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్సీ కవిత(ఫైల్ ఫొటో)
mlc kavitha birthday wishes to ktr:రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా... పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా సినీ, రాజకీయప్రముఖలు ఆయనకు విషెస్ చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ట్వీట్లు చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కూడా శుభాకాంక్షలు చెప్పారు.
ఈ నేపథ్యంలోనే కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. 'హ్యపీ బర్త్ డే అన్నయ్య'..అంటూ రాసుకొచ్చారు. కేటీఆర్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి.. కేటీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే డియర్ రామ్ అని ట్వీట్ చేశారు. ఓ ఫొటోను షేర్ చేస్తూ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. తమ ప్రియతమ నేతను విష్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కేటీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే వరదల కారణంగా అనేక గ్రామాలు ముంపుకు గురైన పరిస్థితులలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. అనేక జిల్లాలలో భారీ వర్షాల కారణంగా, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తన పుట్టిన రోజు వేడుకలకు బదులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారికి తమకు తోచిన మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద సహాయం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాలికి గాయం...
ktr leg fractured: మరోవైపు శనివారం రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌కు స్వల్పంగా గాయమైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. జారిపడటంతో ఎడమకాలు చీలమండ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యిందని ట్వీట్ చేశారు. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.ఈ సమయంలో ఓటీటీ షోల గురించి ఎవరైనా సలహా ఇవ్వండి అంటూ రాసుకొచ్చారు. కట్టుతో ఉన్న ఫొటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే.
టాపిక్