తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Electric Buses: తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభించిన మంత్రులు పొన్నం, భట్టి, కోమటిరెడ్డి..

TSRTC Electric Buses: తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభించిన మంత్రులు పొన్నం, భట్టి, కోమటిరెడ్డి..

Sarath chandra.B HT Telugu

12 March 2024, 13:09 IST

google News
    • TSRTC Electric Buses: తెలంగాణ Telangana రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సర్వీసుల్లో ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెట్టారు. టిఎస్‌ఆర్టీసీలో తొలి విడత మహాలక్ష్మీ Mahalakshmi సిటీ ఎలక్ట్రిక్ బస్సుల్ని City Electric Buses మంత్రులు ప్రారంభించారు. 
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ సిటీ బస్సులు ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ సిటీ బస్సులు ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ సిటీ బస్సులు ప్రారంభించిన మంత్రులు

TSRTC Electric Buses తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో తొలి విడత మహా లక్ష్మి సిటీ ఎలక్ట్రిక్ బస్సుల్ని మంత్రులు ప్రారంభించారు. తొలి దశలో 25 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ , కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.

ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెట్టే కార్యక్రమంలో ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఎరియర్ బాండ్స్ చెక్కులను ఉద్యోగులకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ అందించారు.

ఆర్టీసిలో మహా లక్ష్మి పథకంలో భాగంగా కొత్తగా కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించుకోడం శుభ పరిణామమని మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. మహా లక్ష్మి పథకం మరింత ముందుకు వెళ్తుందని, కోమటి రెడ్డి ఆర్టీసి విషయంలో ఉదారంగా ఉంటున్నారని సహచర మంత్రులు తెలిపారు.

పీఆర్సీ పై ముఖ్యమంత్రి మాట్లాడానికి కుదరలేదని, త్వరలో ఈ విషయంలో స్పష్టత రానుందని మంత్రులు తెలిపారు. బాబు జగ్జీవన్ రాం భవనాన్ని ప్రారంభించ డానికి వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రిని కలిసి పీఆర్సీ ఇవ్వాలని కోరినట్టు పొన్నం తెలిపారు.

ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వడానికి తనకు అభ్యంతరం లేదని.. ఆర్థిక మంత్రి ఓకే అంటే ఇవ్వాలని సిఎం చెప్పారన్నారు.

ఆర్టీసీని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, మహా లక్ష్మి పథకం వచ్చిన తర్వాత ప్రతి ఇల్లు కళకళ లాడుతుందన్నారు. 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైన సంస్థలో అరియర్స్ బాండ్స్ ,కారుణ్య నియామకాలు , పీఆర్సి ,కొత్త నియామకాలు ,కొత్త బస్సుల కొనుగోలు మహా లక్ష్మి పథకం ద్వారానే సాధ్యమైందని చెప్పారు.

సంస్థ కోసం ఆర్టీసీ సిబ్బంది కష్టపడుతున్నారని వారికి అభినందనలు చెప్పారు. మహా లక్ష్మి పేరుతో ఆర్టీసి కళకళలాడుతుందన్నారు. ఆర్టీసీ సంస్థ కోసం ముఖ్య మంత్రి,ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులంతా సహకరిస్తున్నారన్నారు.

ఆర్టీసీ 100 శాతం ఆక్యుపెన్సీతో ముందుకు వెళ్తోందని, ఆపరేషన్ లాస్ అధిగమించి పాత బకాయిలు కూడా తీర్చుకుంటున్నట్టు చెప్పారు. ఆర్టీసీలో కొత్త నియామకాలు చేపడుతున్నామన్నారు.

ఆర్టీసి అంటే పేద ప్రజలు ప్రయాణించే బస్సులని, ఆర్టీసి పరిరక్షణ , కార్మికుల సంక్షేమం తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి లో మొదటిసారి ఎలక్ట్రిక్ నాన్ ఎసి బస్సులు వచ్చాయన్నారు. రాబోయే కాలంలో అనేక బస్సులు వస్తున్నాయని మంత్రులు తెలిపారు.

కొత్త కొత్త ఆలోచనలతొ ఆర్టీసీ సమస్యలు పరిష్కరించి ఆర్టీసీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ముందుకు తీసుకుపోతామన్నారు. ముఖ్యమంత్రి ఆర్టీసికి పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు.

తదుపరి వ్యాసం