Mallareddy Comments : 'లవ్'పై మంత్రి మల్లారెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్
05 December 2022, 20:21 IST
- Minister Mallareddy On Life : జీవితంలో కొన్ని సాధించాలి అంటే కొన్నింటికి దూరంగా ఉండాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. జీవితంలో కొన్ని కావాలి అనుకుంటే.. కొన్ని వదులుకోవాలని చెప్పారు. కొన్ని విషయాలకు దూరంగా ఉంటేనే ఏదైనా సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై జరిగిన ఐటీ దాడులపై స్పందించారు. తనపై ఐటీ రైడ్స్(IT Radis) జరిగినా.. భయపడలేదని చెప్పారు. వాళ్లు వచ్చి.. వాళ్ల పని చూసుకున్నారన్నారు.
'ఐటీ దాడులు జరిగాయి. నేను అస్సలు భయపడలేదు. నాలుగు వందల మంది వచ్చారు. వాళ్ల పనేదో వాళ్లు చేసుకున్నారు అంతే. నేనేం క్యాసినో(Casino) నడిపించలేదు. కాలేజీలు మాత్రమే నడిపిస్తున్నాను. కొంతమంది బ్లాక్ మెయిలర్స్ ఇబ్బంది పెట్టారు. అయినా పట్టించుకోలేదు.' అని మల్లారెడ్డి అన్నారు.
ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి. తన కుమారుడికే సీటు కావాలంటే.. తాను ఇవ్వలేదని చెప్పారు. భూమి అమ్మేసి మరీ.. కొడుకును ఎంబీబీఎస్(MBBS) చేయించినట్టుగా తెలిపారు. కొన్ని సాధించాలి అంటే.. కొన్నింటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు హితవు చెప్పారు. 'ప్రేమ దోమ పక్కన పెట్టి కష్టపడాలి. ప్రేమ, ఫ్రెండ్ షిప్ అన్నింటికీ దూరంగా ఉండాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది.' అని మల్లారెడ్డి అన్నారు.
గెలుపు కోసం కష్టపడితేనే.. లైఫ్ పార్టనర్ లు వాల్లే వస్తారని విద్యార్థులతో మల్లారెడ్డి చెప్పారు. కల కన్నానని, దాన్ని నిజం చేసుకున్నానని తన అంత అదృష్టవంతుడు ఎవడూ లేడని అన్నారు. అయితే ఈ సందర్భంగా తన కుమారుడి పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి. తమ కొడుకుని తమకు తెలిసిన అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేస్తే.. పార్టీలు, పిక్నిక్స్ అంటూ తిరిగేదని వ్యాఖ్యానించారు. అలా కాలేదు కాబట్టి.. ఇప్పుడు తన కోడలు మెడికల్(Medical) ఇనిస్టిట్యూట్ కు ఎండీ అయిందని పేర్కొన్నారు. కష్టపడి చదివితేనే పైకి వస్తారని విద్యార్థులతో చెప్పారు మల్లారెడ్డి.