KTR Son Himanshu Song: పాటతో అదరగొట్టిన హిమాన్షు.. మురిసిపోయిన తండ్రి కేటీఆర్
18 February 2023, 6:53 IST
- Himanshu Rao Cover Song On YouTube: మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు సింగర్ గా అదరగొట్టాడు. అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్ లాసన్ పాడిన 'గోల్డెన్ అవర్' సాంగ్‌ను హిమాన్షు తనదైన స్టైల్ లో అద్భుతంగా ఆలపించాడు. ఇదీ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాంగ్ తో అదరగొట్టిన హిమాన్షు.. సంబురపడ్డ తండ్రి కేటీఆర్
Minister KTR Son Himanshu Rao Song: కల్వకుంట్ల హిమాన్షు రావ్... కేటీఆర్ తనయుడిగా పేరొంది హిమాన్షు.. ఈ మధ్య అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తున్నారు. విభిన్న కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా తనలోని కొత్త టాలెంట్ ను బయటపెట్టాడు. సింగర్ గా అదరగొట్టాడు హిమాన్షు. అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్ లాసన్ పాడిన ‘గోల్డెన్ అవర్’ సాంగ్‌ను అద్భుతంగా ఆలపించాడు. ఈ సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేశాడు.
‘గోల్డెన్ అవర్ X హిమాన్షు కవర్’ పేరుతో తన యూట్యూబ్‌లో ఛానెల్‌లో ఈ సాంగ్ ను షేర్ చేశాడు హిమాన్షు. పాటలోని పదాలను ఉచ్ఛరించిన తీరు ఆకట్టుకుంది. ఇక అతని కొత్త సాంగ్ విన్న... తండ్రి కేటీఆర్ సంబురపడ్డారు. ‘సూపర్ ప్రౌడ్ అండ్ ఎగ్జయిటెడ్ ఫర్ మై సన్’ అంటూ ట్వీట్ చేశారు. తండ్రి కేటీఆర్ రీట్వీట్‌కు హిమాన్షు రావు థ్యాంక్యూ డాడీ అంటూ రిప్లై ఇచ్చారు.
హిమాన్షు సాంగ్ పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రౌడ్ ఆఫ్ యూ అల్లుడు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు కవిత. రాబోయే రోజుల్లో మరిన్ని సాంగ్స్ వినాలని అనుకుంటున్నామంటూ రాసుకొచ్చారు. మరోవైపు హిమాన్షుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. సాంగ్ చాలా బాగుందని... మరిన్ని పాటలను పాడాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరైతే హిమాన్షులో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా..? అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ స్కూల్‌లో ఈ మధ్యనే కాస్నివాల్ అనే వేడుకను ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్నిఅందులో చదువుతున్న కేటీఆర్ కుమారుడు హిమాన్షు ముందుండి నడిపించాడు. సృజనాత్మకత, సామాజిక స్పృహ లక్ష్యంగా ఈ కాస్నివాల్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 30కి పైగా స్టాళ్లను విద్యార్థులు ప్రదర్శించారు. ఇందులో తమ కళారూపాలను ఏర్పాటు చేశారు. ఫుడ్, ఫన్, గేమ్స్ ఆడటం, సైకిల్ పెయింటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ లాంటి కార్యక్రమాలతో విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ముండిండిన నడిపించిన హిమాన్షును అభినందించారు.
ఈ ఈవెంట్ సందర్భంగా హిమాన్షు మాట్లాడిన వీడియో కూడా తెగ వైరల్ అయింది. తమ కాస్నివాల్ కార్యక్రమం పర్యావరణం, విద్యకు మధ్య వారధి లాంటిదని చెప్పుకొచ్చాడు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే డబ్బును నానక్‌రామ్‌గూడ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణకు ఇస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే.