తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Governor Quota Mlc Issue: బీజేపీ అధ్యక్షురాలు గవర్నర్ ఎలా అయ్యారన్న హరీష్‌రావు

Governor quota Mlc Issue: బీజేపీ అధ్యక్షురాలు గవర్నర్ ఎలా అయ్యారన్న హరీష్‌రావు

HT Telugu Desk HT Telugu

26 September 2023, 8:28 IST

google News
    • Governor quota Mlc Issue: తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై‌ను   తెలంగాణ గవర్నర్‌గా ఎలా  నియమించారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ నిర్ణయించడాన్ని తప్పు పట్టారు. 
మంత్రి హరీష్ రావు
మంత్రి హరీష్ రావు

మంత్రి హరీష్ రావు

Governor quota Mlc Issue: దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ నిర్ణయించడం దారుణం అని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణలు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారు అన్నారు.

తమ తమ రంగాల్లో వారిద్దరూ ప్రజలకు మేలుచేసే అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారని అలాంటివారిని తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తే, గవర్నర్‌ వారిద్దరు బీఆర్‌ఎస్‌ పార్టీలో సభ్యులుగా ఉండడం వల్ల అనర్హులనడం దారుణమన్నారు.

తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై గారు తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తికి రాష్ట్ర గవర్నర్‌గా ఇవ్వవచ్చా..? అని హరీష్ రావు ప్రశ్నించారు. సర్కారియా కమిషన్‌ ప్రతిపాదనలను బట్టి చూస్తే గవర్నర్‌ పదవిలో తమిళిసై ఉండకూడదని మరి ఆమె ఎలా ఉన్నారన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఆ పార్టీ నాయకులనే రాజ్య సభకు, కౌన్సిల్ కు పంపుతున్నారని గుర్తు చేశారు. బీజేపీ పార్టీకి చెందిన గులాం అలీ ఖతానాను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపలేదా అన్నారు. బీజేపీ నేత మహేశ్‌ జఠ్మలానీ, సోనాల్‌ మాన్‌సింగ్‌, రాంషఖల్‌, రాకేశ్‌ సిన్హా.. ఇలా వీళ్లంతా బీజేపీలో పనిచేయలేదా అని ప్రశ్నించారు. వీరిని ఎలా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులగా నియమించారన్నారు.

బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో జితిన్‌ ప్రసాద్‌, గోపాల్‌ అర్జున్‌ బూర్జీ, చౌదరీ వీరేంద్ర సింగ్‌, రజనీకాంత్‌ మహేశ్వరీ, సాకేత్‌ మిశ్రా.. హన్స్‌రాజ్‌ విశ్వకర్మ.. ఇలా అనేక మందిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారని వీరంతా బీజేపీ పార్టీలో ప్రత్యక్షంగా ఉన్నవారే కదా అని నిలదీశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధానం.. బీజేపీతో కలిసిలేని రాష్ట్రాల్లో మరో విధానం అమలు చేస్తారా అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఒక నీతి.. బీజేపీయేతర రాష్ట్రాలకు మరోనీతి ఉంటుందా అన్నారు.

తెలంగాణ విషయంలో గవర్నర్‌ వైఖరిలో మార్పు లేదని నిజంగా తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తే గవర్నర్‌ సరిచేస్తే ఏమో అనుకోవచ్చని , నీతి, నిజాయితీతో పనిచేస్తే కూడా గవర్నర్‌ కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేసిన బిల్లులను ఆపారని రెండేసిసార్లు బిల్లులను పంపినా వాటిని ఆమోదించ లేదన్నారు. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం మరీ దారుణమని తెలంగాణ ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని చెప్పారు.

తదుపరి వ్యాసం