తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Rains Updates: నేడు రేపు తెలంగాణలో వర్షాలు….

TS Rains Updates: నేడు రేపు తెలంగాణలో వర్షాలు….

HT Telugu Desk HT Telugu

31 July 2023, 5:57 IST

google News
    • TS Rains Updates: తెలంగాణలో మల్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
తెలంగాణకు మళ్లీ వర్షసూచన
తెలంగాణకు మళ్లీ వర్షసూచన (twitter)

తెలంగాణకు మళ్లీ వర్షసూచన

TS Rains Updates: తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో గత వారం భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురవడంతో భారీ నష్టం వాటిల్లింది. కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా వాటిిల్లింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీగా వానలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

ఆదివారం సంగారెడ్డి జిల్లా జన్నారంలో 40.3 మిల్లీమీటర్లు, మేడ్చల్‌‌లో 37.5, మెదక్‌ జిల్లా కాగజ్‌ మద్దూర్‌‌లో 35మి.మీ, యాదాద్రి జిల్లా బీబీనగర్‌ 27.5 మిల్లీ మీటర్లు, నిర్మల్‌ జిల్లా విశ్వనాథ్‌పూర్‌ 27మి.మీ, సంగారెడ్డి జిల్లా లక్ష్మిసాగర్‌ 26.8మి.మీ, మేడ్చల్‌ జిల్లా కేశవరంలో 26మి.మీ, ఆలియాబాద్‌‌లో 25మి.మీ, బండ మాదారంలో 24.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి, మంచిర్యాల, ఆదిలాబాద్‌, జగిత్యాల, నిజామాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, జనగామ, మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాలతో పాటు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని కూకట్‌పల్లి, బాచుపల్లి, సికింద్రాబాద్‌, నేరెడ్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

గత ఏడాదితో పోలిస్తే తక్కువే…

ఈ ఏడాది భారీ వర్షాలు జనాన్ని హడలెత్తించినా గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో వర్షాలు 19 శాతం తక్కువగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గత ఏడాది జూన్‌ నుంచి జులై 30 వరకు 687.1 మిల్లీమీటర్ల వాన పడింది. ఈ ఏడాది ఇప్పటివరకు 559.1 మిల్లీమీటర్లు మాత్రమే కురిసిందని తెలిపింది.

జులైలో నిర్మల్‌ మండలంలో అత్యధికంగా 16.5సెంటి మీటర్ల వర్షం పడింది. కరీం నగర్‌ రూరల్ మండలంలో 16, నిర్మల్‌ గ్రామీణ మండలం 14.9, ఖానాపూర్‌ 13.1, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం 12.6, రాయికల్‌ 10.3, జగిత్యాల గ్రామీణ మండలం 10.2, నిర్మల్‌ జిల్లా లక్ష్మణ్‌చాంద 9.8, జగిత్యాల జిల్లా గొల్లపల్లి 8, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 7.5 సెంటిమీటర్ల వర్షం పడిందని వెల్లడించింది.

తదుపరి వ్యాసం