తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ranga Reddy District : ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం - 50 మంది కార్మికుల ప్రాణాలను కాపాడిన బాలుడు..!

Ranga Reddy District : ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం - 50 మంది కార్మికుల ప్రాణాలను కాపాడిన బాలుడు..!

26 April 2024, 20:31 IST

google News
    • Alvin Pharma Fire Accident at Shadnagar: రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టింది.
ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

Alvin Pharma Fire Accident at Shadnagar : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 50 మందికిపైగా కార్మికులు విధుల్లో ఉన్నారు. పలువురు సిబ్బంది నిచ్చెన సాయంతో బిల్డింగ్ పై నుంచి బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది….. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండల కేంద్రంలోని అల్విన్‌ ఫార్మసీ కంపెనీ ఉంది.  పక్కన ఉన్న ఓ షెడ్డులో వెల్డింగ్ పనులు జరుగుతుండగా… అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది.  క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి. 

కాపాడిన బాలుడు…

ఓ బాలుడు చేసిన సాహసంతో ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని పోలీసులు తెలిపారు.  సాయి చరణ్ అనే బాలుడు…. ప్రమాద తీవ్రతను గుర్తించి  బాధితులను కాపాడాడు. ఇందుకోసం ఏకంగా భవనంపైకి ఎక్కి ఓ తాడును కట్టాడు. లోపల ఉన్న కార్మికులు… ఈ తాడు సాయంతో కిందికి వచ్చారు. ఇలా 50 మందికిపైగా కార్మికులు క్షేమంగా బయటికి వచ్చారు. 

కార్మికుల ప్రాణాలను కాపాడిన బాలుడిన పోలీసులు అభినందించారు. కార్మికులను కాపాడిన హీరో అంటూ కితాబునిచ్చారు. 

 

 

తదుపరి వ్యాసం