తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Manikonda Dee : మణికొండ మాజీ డీఈఈ ఇంట్లో నోట్ల కట్టలు- వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన భర్త

Manikonda DEE : మణికొండ మాజీ డీఈఈ ఇంట్లో నోట్ల కట్టలు- వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన భర్త

09 October 2024, 20:05 IST

google News
    • Manikonda DEE : మణికొండ మాజీ డీఈఈ దివ్య జ్యోతి భారీగా లంచం తీసుకుంటున్నారని ఆమె భర్త ఆరోపించారు. ఆమె లంచంగా తీసుకున్న డబ్బు ఇంట్లో ఎక్కడెక్కడ పెడుతున్నారో... ఆమె భర్త వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
మణికొండ మాజీ డీఈఈ ఇంట్లో నోట్ల కట్టలు- వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన భర్త
మణికొండ మాజీ డీఈఈ ఇంట్లో నోట్ల కట్టలు- వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన భర్త

మణికొండ మాజీ డీఈఈ ఇంట్లో నోట్ల కట్టలు- వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన భర్త

తన భార్య లంచం తీసుకుంటుందని, ఇంటి నిండా డబ్బు కట్టలున్నాయని ఓ భర్త వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ మాజీ డీఈఈ దివ్య జ్యోతిపై ఆమె భర్త అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో తన భార్య జ్యోతి ప్రతి రోజూ లంచం తీసుకుంటుందంటూ ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఉన్న డబ్బుల వీడియోలను ఆమె భర్త శ్రీపాద్ విడుదల చేశారు. ఇంట్లో డబ్బుల్ని దాచిన ప్రతి చోటును చూపిస్తూ వీడియో రికార్డు చేశారు. లంచం తీసుకోవద్దని తన భార్యకు చెబుతున్న వినడంలేదని, ఇక తట్టుకోలేక ఈ వీడియోలు తీసినట్లు జ్యోతి భర్త తెలిపారు.

డీఈఈ ఇంట్లో నోట్ల కట్టలు

ఇప్పటి వరకూ బాధితులు లంచగొండి అధికారులను ఏసీబీ పట్టించిన ఘటనలు చూశాం. అయితే తన భార్య కట్టల కట్టల డబ్బులు లంచంగా తీసుకుంటుందని...భర్తే వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టడం హైదరాబాద్ లో సంచలనం అయ్యింది. మణికొండ మున్సిపల్ మాజీ డీఈఈ దివ్యజ్యోతి కాంట్రాక్టర్ల నుంచి భారీగా లంచం తీసుకున్నారని, ఆమె భర్తే వీడియోలు తీశారు. అవినీతిగా తీసుకున్న నగదును ఇంట్లో ఎక్కడెక్కడ పెడుతున్నారో బయపెట్టారు దివ్యజ్యోతి భర్త శ్రీపాద్. బీరువాలో, పరుపు కింద, దేవుని గుడిలో, కిచెన్ లో, పూల కుండీలో ఎక్కడ పడితే అక్కడే పేపర్లో చుట్టిన నోట్ల కట్టలు ఉన్న వీడియోను శ్రీపాద్ బయట పెట్టారు.

లంచం తీసుకోవడంపై భార్యాభర్తల మధ్య చాలా సార్లు గొడవలు జరిగినట్లు ఆయన వీడియోలో తెలిపారు. అయినా ఆమె తీరు మార్చుకోక పోవడంతో లంచగొండి భార్యను అధికారులకు పట్టించేందుకు వీడియో తీసినట్లు తెలిపారు. అలాగే తన భార్య... ఆమె తమ్ముడి ఖాతాలో భారీగా డబ్బు జమ చేస్తుందని, అలాగే నగదు రూపంలో చాలానే ఇచ్చిందని ఆరోపించారు. అధికారులు అతడిని కూడా తనిఖీ చేస్తే అన్ని విషయాలు బయటపడతాయన్నారు.

దివ్య జ్యోతి అవినీతి వెనుక ఆమె సోదరుడు శరత్ కుమార్‌కు క్రిమినల్ మైండ్ ఉందని, లంచం తీసుకోవాలని దివ్యపై ఒత్తిడి తెచ్చారని శ్రీపాద్ ఆరోపించారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెను జీహెచ్‌ఎంసీకి బదిలీ చేసినట్లు సమాచారం.

తదుపరి వ్యాసం