Manda Krishna: కడియం శ్రీహరి కుట్రలతోనే రాజయ్యకు అన్యాయం జరిగిందన్న మందకృష‌్ణ
29 August 2023, 8:23 IST
- Manda Krishna: బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్యకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడం వెనుక కడియం శ్రీహరి కుట్రలు ఉన్నాయని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. కడియం గుంట నక్క రాజకీయాలతోనే రాజయ్యకు అన్యాయం జరిగిందన్నారు.
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ
Manda Krishna: మాజీ మంత్రి బిఆర్‌ఎస్ నాయకుడు కడియం శ్రీహరి గుంటనక్క లాంటోడని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. బిఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో రాజయ్యకు స్థానం దక్కకపోవడం వెనుక కడియం శ్రీ హరి కుట్ర ఉందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గుంటనక్క లాంటి వాడని, 2014లో డాక్టర్ రాజయ్య డిప్యూటీ సీఎం పదవి నుంచి బర్తరఫ్ కావడానికి, ప్రస్తుతం బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడం వెనుక కడియం కుట్రలు ఉన్నాయని, రెండు సందర్భాల్లో రాజయ్య మీద కేసీఆర్ చర్యలు తీసుకోడానికి కడియం సూత్రధారి అని మంద కృష్ణ మాదిగ అన్నారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం జరిగిన నియోజకవర్గస్థాయి మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవసభలో మందకృష్ణ పాల్గొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మాదిగల అస్థిత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాదిగలందరిపై ఉందన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో రాజయ్య పంచె, ధోతి కట్టుకుని రాష్ట్రమంతా తిరిగితే పెద్దదొర కేసీఆర్, దళితదొర కడియంలు ఓర్వలేదక పోయారని మందృష్ణ ఆరోపించారు. కడియం మాదిగలను అణగదొక్కేలా గుంటనక్కలా వ్యవహరిస్తున్నారన్నారు.
సర్పంచి నవ్య ఆరోపణల నేపథ్యంలో లైంగిక వేధింపుల విషయమై రాజయ్యపై కుట్ర జరిగిందని, నిరాధారమైన ఆరోపణలతో మహిళా కమిషన్ సుమోటో కేసు ఎలా స్వీకరించిందని మంద కృష్ణ ప్రశ్నించారు. భూపాలపల్లి, బెల్లంపల్లి, ఆర్మూరు ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపులపై కమిషన్ చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. కేవలం రాజయ్య మాదిగ ఎమ్మెల్యే కావడంతోనే మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించారన్నారు. ఈ తరహా చర