తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత..

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత..

HT Telugu Desk HT Telugu

19 March 2022, 20:32 IST

google News
    • మల్లు స్వరాజ్యం శనివారం కన్నుమూశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలిగా, స్వాతంత్ర సమరయోధురాలిగా ఆమె ఎనలేని సేవలందించారు.
మల్లు స్వరాజ్యం
మల్లు స్వరాజ్యం (Hindustan times telugu)

మల్లు స్వరాజ్యం

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం.. శనివారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్​లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 91ఏళ్ల స్వరాజ్యం మరణించారు.

స్వరాజ్యం జీవితం.. స్ఫూర్తిదాయకం..

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో 1931లో జన్మించారు మల్లు స్వరాజ్యం. ఆమె భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతుల బిడ్డ. 1945- 46 సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం సర్కారును గడగడలాడించిన చరిత్ర వీరి సొంతం.

1947- 46వ సంవత్సరంలో స్వరాజ్యం ఇంటిని నైజాం గుండాలు తగలబెట్టారు. మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో భాగంగా అదిలాబాద్ , వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు.

మల్లు స్వరాజ్యంకు మహిళా కమాండర్​గా పని చేసిన అనుభవం కూడా ఉంది. అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యంను పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని ఆమె పేదలకు పంచిపెట్టవారు. భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సిపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. స్వరాజ్యం సోదరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు.

మల్లు స్వరాజ్యంకు ఒక కూతురు. ఆమె పేరు పాదూరి కరుణ. ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కూతురు.

మల్లు స్వరాజ్యం మృతిపట్ల తెలంగాణ నేతలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థనలు చేశారు.

తదుపరి వ్యాసం