తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mulugu Lord Shiva | శివుడి ఆదేశం.. కలలో ఊరి చివరన అడవిలో శివలింగం.. పుట్టలో తవ్వి చూస్తే.. అంతా షాక్

Mulugu Lord Shiva | శివుడి ఆదేశం.. కలలో ఊరి చివరన అడవిలో శివలింగం.. పుట్టలో తవ్వి చూస్తే.. అంతా షాక్

HT Telugu Desk HT Telugu

28 March 2022, 8:55 IST

google News
    • కొన్నిసార్లు కలలు నిజమవుతాయి. అవి ఊహించలేనంతగా ఉంటాయి. ఎందుకు వస్తాయో.. ఆ తర్వాత వాటికి సంబంధించి.. ఏం జరుగుతందో ఊహించడం కూడా కష్టమే. అలాంటి కలే ఓ వ్యక్తికి వచ్చింది. ఊరి చివరన శివలింగం ఉందంటూ.. చెప్పేవాడు. అందరినీ ఆ ప్రాంతానికి తీసుకెళ్లాడు.
ఊరి చివరన పుట్టలో శివలింగం
ఊరి చివరన పుట్టలో శివలింగం

ఊరి చివరన పుట్టలో శివలింగం

కలలు రావడం.. సహజం. కానీ అవి రియల్ లైఫ్ లో జరుగుతాయా? అంటే కష్టమే. ఎందుకు వస్తుందో.. ఎందుకు పోతుందో.. కల వచ్చిన వ్యక్తే చెప్పడం కష్టం. కానీ ఓ వ్యక్తికి మాత్రం.. వచ్చిన కల నిజమైంది. అదెక్కడో కాదు.. తెలంగాణలోని ములుగు జిల్లాలోనే. అయితే ఆ వ్యక్తికి దైవ కార్యం గురించి కల వచ్చింది. ఆ విషయాన్నే అందరికీ చెప్పాడు. కానీ ఎవరూ నమ్మలేదు. చివరకు ఎలాగోలా నమ్మి అక్కడకు వెళ్లారు. అక్కడ జరిగిన పరిస్థితి చూసి అంతా షాక్ అయ్యారు.

ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేటలో కృష్ణ అనే వ్యక్తికి కల వచ్చింది. ఊరి బయట గుట్టల్లో.. శివ లింగం, నంది ఉన్నట్టు ఊళ్లో చెబుతున్నాడు. అయితే ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేదు. కావాలనే ఇలా చెబుతున్నాడని అనుకున్నారంతా. కృష్ణ మాటలు ఎవరూ పట్టించుకోలేదు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత.. కలలో దేవుడు కనిపించాడని.. కచ్చితంగా శివయ్యతోపాటు.. నందిని కూడా బయటకు తీయాలని ఆదేశించినట్టు.. చెప్పాడు. పూనకంతో ఊగిపోయాడు. మెుదట నమ్మని ప్రజలు.. సరే.. నిజమే అయి ఉండొచ్చని.. ఊరి చివరన అడవిలోని గుట్టల్లోకి వెళ్లారు. కృష్ణ చెప్పిన ప్రాంతంలో తవ్వడం మెుదలుపెట్టారు. అయితే తవ్వుతుండగా.. నమ్మలేని నిజాన్ని చూశారు ఆ ఊరి ప్రజలు.

గుట్ట ప్రాంతంలోని.. పుట్టలో తవ్వుతుండగా.. తేల్లు, పాములు బయటకు వచ్చాయి. అయినా.. కృష్ణ చెప్పాడని.. భయపడకుండా తవ్వారు. అలా తవ్వుతుండగా వారికి అద్భుతం కనిపించింది. కృష్ణ చెప్పింది నిజమైంది. చెట్టు కింద పుట్టలో శివలింగం కనిపించింది. శివలింగాన్ని బయటకు తీసి.. పూజలు నిర్వహించారు. ఆ తర్వాత.. చెట్టు మొదట్లో ప్రతిష్టించారు. అయితే నందిని కూడా .. మరికొన్ని రోజుల్లో ఎక్కడ ఉందో చెబుతానని .. పూనకంతో ఊగిపోతూ.. కృష్ణ చెబుతున్నాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు.. అక్కడకు విపరీతంగా వచ్చి.. పూజలు చేస్తున్నారు.

కొన్ని రోజులుగా ఇదే విషయాన్ని గ్రామస్థులకు కృష్ణ చెబుతున్నాడు. తనకు కలలో దేవుడు కనిపించాడని.. శివలింగం, నంది గురించి చెప్పాడని చెబుతున్నాడు. మెుదట.. పిట్టి పట్టిందనుకున్నరంతా. కానీ అక్కడకు వెళ్లి తవ్వగా.. శివలింగం ప్రత్యక్షమవ్వడంతో.. ఇప్పుడు కృష్ణ చెప్పిన నిజాన్ని నమ్మారు. అయితే శివలింగాన్ని బయటకి తీశారుగా.. గనక.. ఇకపై పూజలు నిర్వహించాలని.. చెబుతున్నాడు. ఇప్పటికే ఈ విషయం చుట్టుపక్కల వారికి కూడా తెలిసింది. శివలింగానికి అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలతో పూజలు చేయడం మెుదలు పెట్టారు. మళ్లీ సమయం చూసుకుని.. నందీశ్వరుడిని కూడా తీస్తానని చెబుతున్నాడు కృష్ణ.

 

తదుపరి వ్యాసం