తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vijaya Kranthi: తెలంగాణలో మరో తెలుగు దినపత్రిక… విజయక్రాంతి పత్రిక ప్రారంభం, ప్రముఖుల అభినందనలు

Vijaya Kranthi: తెలంగాణలో మరో తెలుగు దినపత్రిక… విజయక్రాంతి పత్రిక ప్రారంభం, ప్రముఖుల అభినందనలు

Sarath chandra.B HT Telugu

18 April 2024, 9:18 IST

google News
    • Vijaya Kranthi: తెలంగాణలో మరో తెలుగు పత్రిక అడుగు పెట్టింది. నమస్తే తెలంగాణ పత్రిక వ్యవస్థాపకుడు సిఎల్‌ రాజం విజయక్రాంతి పేరుతో కొత్త దినపత్రికను ప్రారంభించారు.
తెలంగాణలో మరో తెలుగు దినపత్రిక ప్రారంభం
తెలంగాణలో మరో తెలుగు దినపత్రిక ప్రారంభం

తెలంగాణలో మరో తెలుగు దినపత్రిక ప్రారంభం

Vijaya Kranthi: తెలంగాణ ప్రజల కోసం మరో తెలుగు దిన పత్రిక ప్రారంభమైంది. నమస్తే తెలంగాణ Namaste Telangana పత్రిక వ్యవస్థాపకుడు సిఎల్ రాజం  CL Rajam విజయక్రాంతి Vijaya Kranthi పేరుతో కొత్త పత్రికను Daily News Paper ప్రారంభించారు. 2013లో తెలంగాణ పాఠకుల కోసం ప్రత్యేకంగా పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో మెట్రో పేరుతో మరో ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. కొన్నేళ్ల క్రితం నమస్తే తెలంగాణ యాజమాన్యం నుంచి తప్పుకున్న ఆయన విజయక్రాంతి పేరుతో కొత్త పత్రికను ప్రారంభించారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు చౌరస్తాలో నిలబడి ఉందని, తెలంగాణ గతాన్ని గుర్తెరిగి సరైన పంథా ప్రజలే నడిపించుకోవాల్సిన పరిస్థితి ఉందని ప్రారంభోత్సవ సంచికలో పేర్కొన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలను సరైన రీతిలో దీర్ఘకాల ప్రయోజనాలను కల్పించే మార్గంలో పెట్టుకోవాల్సి ఉందని, దూరదృష్టి కలిగిన రాజకీయం తెలంగాణలో వర్థిల్లాలన్నారు.

పదేళ్ల కాలంలో తెలంగాణ ఎన్నో ఉత్థానపతనాలను చవిచూసిందని, రాబడులను మించిన ఖర్చుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేడిపండులా తయారైందన్నారు.

ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పడంలో దర్పణంలా పనిచేస్తామన్నారు. ప్రభుత్వంతో ప్రజల తరపున మాట్లాడతామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు..

డిజిటల్ మీడియా యుగంలో కొత్త పత్రికను తీసుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రజల అభిమతమే అజెండాగా సరికొత్త పాత్ర పోషించాలన్నారు.

తెలంగాణ ఉద్యమానికి అక్షరాలతో ఊపిరిపోసిన సీఎల్‌ రాజం నేతృత్వంలో విజయక్రాంతి పత్రిక ప్రారంభించడంపై ఎంపీ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు.

స్వచ్ఛమైన వార్తా విలువలతో సమాజానికి అసలైన సమాచారాన్ని అందించాలని ఆశిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ అకాంక్షించారు. విజయక్రాంతి పత్రికను హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ నుంచి ప్రచురించనున్నారు.

తదుపరి వ్యాసం