తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kishanreddy: పవన్‌‌పై కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలని ప్రచారం.. పోలీస్‌ కేసుకు మంత్రి ఆదేశం

Kishanreddy: పవన్‌‌పై కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలని ప్రచారం.. పోలీస్‌ కేసుకు మంత్రి ఆదేశం

Sarath chandra.B HT Telugu

11 December 2023, 7:31 IST

google News
    • Kishanreddy: జనసేన అధ‌్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. 
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishanreddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పవన్ కళ్యాణ్‌తో కలిసి పోటీ చేయడమే కారణమంటూ ఆదివారం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. పవన్‌పై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారని, పవన్‌ నమ్మడం వల్ల ఎన్నికల్లో నష్టపోయామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. మంత్రి అటువంటి ప్రకటనలు చేయకపోయినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బాధ్యులపై కేసు నమోదు చేయాలని కిషన్ రెడ్డి ఆదేశించారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ను నమ్ముకొని నష్టపోయామని, పొత్తు ఉపసంహరించుకోవాలని భావించిన అప్పటికే నష్టం జరిగిపోయిందని కిషన్ రెడ్డి అన్నట్టుగా ప్రచారం జరిగింది. తెలంగాణలో సొంతంగా పోటీ చేసి ఉంటే గ్రేేటర్ హైదరాబాద్‌ పరిధిలో 4-5 సీట్లు గెలిచే అవకాశం ఉండేదని, తమ పార్టీ కార్పొరేటర్ల మాట విన్నా బాగుండేదని కిషన్‌ రెడ్డి పేరిట సందేశాలు వెలువడ్డాయి.

ఓటమికి తనదే బాధ్యత అని, లింగంపల్లి, ఖైరతబాద్,కూకటపల్లి, కుత్బుల్లాపూర్‌, యాకత్‌పురా, ఉప్పల్, రాజేంద్ర నగర్‌లలో పవన్ కళ్యాణ్ తో పొత్తు కారణంగానే ఘోరంగా ఓడిపోయామని కిషన్ రెడ్డి అన్నట్టు ప్రచారం జరిగింది. కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలను ఆయన కార్యాలయం వెంటనే ఖండించినా అప్పటికే అవి వైరల్‌గా మారాయి.

దీంతో కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు.తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసిన సంగతి మీకు తెలిసిందేనని, ఈ నిర్ణయం రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్నదే అని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే బీజేపీ, జనసేనతో కలిసి బరిలో దిగాయని చెప్పారు

ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేవారు. అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

తదుపరి వ్యాసం