తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tiger Reserve Entry: కావ్వాల్ టైగర్ జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాలన్న ఖానాపూర్ ఎమ్మెల్యే భోజ్జు

Tiger Reserve Entry: కావ్వాల్ టైగర్ జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాలన్న ఖానాపూర్ ఎమ్మెల్యే భోజ్జు

HT Telugu Desk HT Telugu

10 September 2024, 14:13 IST

google News
    • Tiger Reserve Entry: ప్రజల అవసరాల దృష్ట్యా మంచిర్యాల నుంచి నిర్మల్ వరకు, ఉట్నూర్ నుంచి మంచిర్యాల వరకు భారీ వాహనాల ప్రవేశానికి ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు అనుమతులు ఇవ్వాలని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ భోజ్జు పటేల్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు.
కవ్వాల్ అటవీ ప్రాంతంలో రోడ్డు అనుమతించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి
కవ్వాల్ అటవీ ప్రాంతంలో రోడ్డు అనుమతించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి

కవ్వాల్ అటవీ ప్రాంతంలో రోడ్డు అనుమతించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి

Tiger Reserve Entry: ప్రజల అవసరాల దృష్ట్యా మంచిర్యాల నుంచి నిర్మల్ వరకు, ఉట్నూర్ నుంచి మంచిర్యాల వరకు భారీ వాహనాల ప్రవేశానికి ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు అనుమతులు ఇవ్వాలని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ భోజ్జు పటేల్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. రాష్ట్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో ఆయన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీస్కోచ్చారు.

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేదించారని దీంతో వ్యాపార, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. భారీ వాహనాలను అనుమంతిచక పోవడంతో సరుకులు తరలింపులో వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు విద్యుత్ సదుపాయాలు కల్పించేందుకు అనుమతులు ఇవ్వాలని, గిరి వికాసం కింద చేపట్టిన బావులకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలని ఆయన కోరారు.

అటవీ భూముల్లో సాగు చేసుకొంటున్న గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు ఇవ్వలన్నారు. గిరిజనుల పోడు భూముల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని,అనేక మంది గిరిజన రైతులకు పోడు పట్టాలు అందలేదని వివరించారు. గిరిజనేతర రైతులు కూడ అటవీ భూముల్లో సాగులో ఉన్నారని వారికీ కూడ పోడు పట్టాలు ఇచ్చే విషయంలో సాధ్య సాధ్యలను పరిశీలించాలని కోరారు.

టైగర్ రిజర్వ్ నిబంధనలు సడలించాలి

తన నియోజకవర్గం పూర్తిగా టైగర్ రిజర్వు పరిధిలో ఉందని, తాను చిన్న చిన్న కనీస సౌకర్యాలు కల్పించాలి అన్నా కూడా అటవీ శాఖ నిబంధనలు అడ్డుగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.

అనేక చోట్ల ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించుకోవల్లన్న నిబంధన కారణంగా ఏం చేయలేని స్థితి లో ఉన్నాయన్నారు.అటవీ ప్రాంతంలో ఉన్న మిద్దె చింత, ధర్మాజీ పేట్, రాగి దుబ్బ గ్రామాలలో విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గుతున్నాయని, ఆయా గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు ప్రయత్నిస్తే అటవీ శాఖ అధికారులు అడ్డుకొంటున్నారని, ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అందే విధంగా అటవీ శాఖ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

గిరివికాసం పథకం కింద గిరిజన రైతులకు వ్యవసాయ బావులు అందించామని కానీ ఇంతవరకు త్రీ పేస్ కరెంట్ ఇవ్వకపోవడంతో వ్యవసాయ బావులు నిరూపయోగంగా మారాయని వ్యవసాయ బావుల్లో పుష్కళంగా నీరున్న కరెంట్ లేకపోవడంతో బావుల నీరు వ్యవసాయానికి మల్లించుకోలేక పోతున్నారని వారికి త్రిపేస్ కరెంట్ అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

(రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం