Maida Flour : రుచికరమైన విషం "మైదా", ప్రాణాలనే హరిస్తుందన్న నిజం తెలుసా?
27 December 2023, 15:02 IST
- Maida Flour : మైదాతో చేసిన పదార్థాలు నోటికి ఎంత రుచిగా ఉంటాయో... ఆరోగ్యానికి అంత హాని చేస్తాయి. పొద్దున్న టిఫెన్ నుంచి రాత్రి వరకూ మైదా మిక్స్ డ్ ఆహారాలను లాగించేస్తున్న మనకు..మెల్లగా మన ఆరోగ్యా్న్ని పాడుచేసుకుంటున్నామని తెలియదు.
మైదా ఆహార పదార్థాలు
Maida Flour : మైదా పిండితో తయారు చేసే పూరి, పరోట, బోండా వంటి ఆహార పదార్థాల రుచి అదరహో అన్నట్లు ఉంటాయి. కానీ మైదా పిండి మన శరీరంలో క్రమంగా అనేక మార్పులకు కారణమై చివరికి మన ప్రాణాలనే హరిస్తుందన్న నిజం మీకు తెలుసా? ఇది నూటికి నూరుపాళ్ల వాస్తవం. మైదా పిండి ఆరోగ్యానికి హానికరమని చాలా మందికి తెలియదు. ఫలితంగా పిల్లలే కాదు.. వయసుతో సంబంధం లేకుండా అందరూ మైదాకి తెలియకుండానే ప్రియులుగా మారి ఆ పిండితో తయారయ్యే స్నాక్స్, టిఫిన్, బిస్కెట్లు తినేస్తున్నారు. ఇక రెస్టారెంట్లలో విక్రయించే పూరీలు, మైసూర్ బోండాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పానీ పూరీలు, సమోసాలు లాగించేస్తూ ఆరోగ్యాన్ని ఫాస్ట్ గా ఖరాబ్ చేసుకుంటున్నాం. ఈ క్రమంలో రుచికే ప్రాధాన్యత ఇస్తున్న మనం ఆరోగ్యాన్ని పణంగా పెట్టేస్తున్నాం. కాగా ఇటీవల కేరళ ప్రజల్లో వచ్చిన చైతన్యం వారి జీవితాల్లో మైదా పిండికి ఆస్కారం లేకుండా చేసింది.
మైదా రూపంలో వెంటాడే మృత్యువు..
గడిచిన కొద్ది నెలల్లో చెన్నైలో మరణించిన వారి సగటు వయస్సు 31 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉందనే విషయం విస్మయం కలిగిస్తోంది. వీరిలో ఎక్కువ మంది గుండె పోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ఇష్టపడే చవకైన విషపూరితమైన ఆహారం మైదాతో చేసిన పదార్థాలే అందుకు కారణం కావడం గమనార్హం. పరోటా దుకాణాలు తమిళనాడు అంతటా విస్తృతంగా కనిపిస్తాయి. ఈ పరోటాల్లో అంతులేనన్ని రకాలు ఉండటం కూడా అందరూ ఇష్టపడటానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. యువతను తనవైపు తిప్పుకునే అసంఖ్యాకమైన పరోటాలు ఆ రాష్ట్రంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. అందుకే వీటి అమ్మకాలు రోజు రోజుకూ దూసుకుపోతూనే ఉన్నాయి. అయితే ఇందులో ఉండే ప్రొటీన్ శరీరానికి హాని కలిగిస్తుందని డైటీషియన్లు సైతం చెబుతున్నా ఎవరికీ వంటపట్టడం లేదు. కాగా మైదా వల్ల కలిగే నష్టాలపై కేరళలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఐరోపా, బ్రిటన్, చైనా వంటి దేశాలు మైదా ఉత్పత్తులను పూర్తిగా నిషేధించి తమ దేశ ప్రజలను అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకున్నాయి.
రాత్రి పూట మరీ ప్రమాదం
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గోధుమల కొరత కారణంగా పిండితో చేసిన ఆహారాన్ని పంపిణీ చేయడం ప్రారంభమైంది. పరోటా కూడా అప్పుడే ప్రాచుర్యం పొందింది. పరోటాలో ఫైబర్ శాతం అస్సలే ఉండదు. ఈ కారణంగా మన జీర్ణశక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు పరోటా తినడం చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు మైదా పిండితో చేసిన రొట్టెలు, కేకులు, బిస్కెట్లు తినడం ఎంత మానేస్తే అంత మంచిదని సూచిస్తున్నారు. లేకపోతే మనం అనారోగ్య పీడితులుగా మారిపోతామని హెచ్చరిస్తున్నారు.
మైదా ఇలా చేస్తారు
మెత్తగా రుబ్బిన గోధుమ పిండి లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ దాన్నుంచి మైదా తయారు చేసేందుకు "బెంజాయిల్ పెరాక్సైడ్" అనే రసాయనాన్ని గోధుమ పిండిలో కలుపుతారు. ఈ రసాయనమే మనం జుట్టుకు వేసుకునే రంగులోని రసాయనం. ఈ విష రసాయనం మైదాలోని ప్రొటీన్లతో కలిసి క్లోమగ్రంధిని దెబ్బతీసి మధుమేహాన్ని కలిగిస్తుంది. అదనంగా, పిండిని మెత్తగా చేయడానికి, సింథటిక్ పిగ్మెంట్‌గా చేయడానికి "అలోకాన్" అనే రసాయనాన్ని కూడా ఉపయోగిస్తారు. భారతదేశంలో మైదా పిండిని ఎక్కువగా తింటారు. ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం మన దేశంలోనే ఎక్కువగా ఉండడానికి కారణం ఇదే అంటున్నారు నిపుణులు. మైదా కిడ్నీ, గుండె జబ్బులకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు. కృష్ణ కుమార్ అనే స్వచ్ఛంద సేవకుడి నేతృత్వంలోని "మైదా విసర్జన సమితి" కేరళలో ఈ విషయంపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. మైదా దుష్పరిణామాలపై పాలక్కాడ్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. పలు జిల్లాల్లో ప్రచారం కొనసాగుతోంది. "ఇక నుంచి మా సంప్రదాయ ఆహారం జీడిపప్పు, రైస్, మొక్క జొన్న.. విదేశీ ఆహారమైన మైదా అనే ప్రోటా మిక్స్‌డ్ కెమికల్‌ని ఏరి పారేయ్యాలని మా కేరళ వాసులం డిసైడ్ అయ్యాము. అందుకోసం కృషి చేస్తున్నాము." అంటున్నారు కేరళ ప్రజలు.
మరి మన సంగతేమిటి?
ఇప్పటిదాకా మన జీవితంతో పెనవేసుకుపోయిన మైదా జాఢ్యాన్ని వదిలించుకోలేమా? మనం అనుకుంటే తప్పకుండా వదిలేసుకోగలం. నోటికి రుచి చూపించి మన ఆరోగ్యాన్ని మనకు తెలియకుండానే క్షీణింపజేసే మైదా పిండికి స్వస్తి పలికి ఎంచక్కా సిరి ధాన్యాలను మన రోజు వారీ వంటకాల్లో చేర్చుకుంటే సరి.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.