తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Acb Raids : ఖమ్మంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన హెడ్ కానిస్టేబుల్

Khammam ACB Raids : ఖమ్మంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన హెడ్ కానిస్టేబుల్

HT Telugu Desk HT Telugu

29 January 2024, 21:23 IST

google News
    • Khammam ACB Raids : ఖమ్మంలో ఏసీబీ వలకు ఓ హెడ్ కానిస్టేబుల్ చిక్కాడు. ఓ కేసులో బాధితుడి నుంచి రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్
ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్

ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్

Khammam ACB Raids : ఖమ్మంలో ఓ హెడ్ కానిస్టేబుల్ రూ. 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న కోటేశ్వరరావు సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. కుటుంబ వివాదం నేపథ్యంలో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసుకు సంబంధించి నోటీసును జారీ చేసే విషయంలో కానిస్టేబుల్ కోటేశ్వరరావు బాధితుడి నుంచి రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారు. ఆస్తి వివాద నేపథ్యంలో కూతురు తండ్రిపై చీటింగ్ కేసు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా కొనసాగుతోంది. కాగా 41 సీఆర్పీ కింద నిందితుడికి నోటీసు జారీ చేయాల్సి ఉంది. హైకోర్టు సైతం నోటీసు జారీ చేయాలని ఆదేశించింది. అయితే ఇదే అదునుగా భావించిన హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావును రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ సిబ్బంది సోమవారం మధ్యాహ్నం వలపన్ని కోటేశ్వరరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుని కుమారుడి నుంచి రూ.50,000 లంచం తీసుకుంటున్న క్రమంలో అవినీతి నిరోధక శాఖ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ను పట్టుకున్నారు.

లంచం అడిగితే వెంటనే కాల్ చేయండి

ప్రభుత్వ అధికారులతో ప్రజా సేవలను పొందడం ప్రజల హక్కని అవినీతి నిరోధక శాఖ ఖమ్మం డీఎస్పీ రమేష్ పేర్కొన్నారు. రూ. 50 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కోటేశ్వరరావును కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కలర్ టెస్టులోను పింక్ గా నమోదైనందున సైంటిఫిక్ ఆధారాలు సైతం తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఏ అధికారి అయినా పని చేసేందుకు లంచం అడిగితే ఇవ్వవద్దని సూచించారు. వెంటనే తమకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఏ సమయంలోనైనా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. 24 గంటల పాటు తాము అందుబాటులో ఉంటామని, టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసిన వెంటనే స్పందిస్తామని వివరించారు. ఎవరైనా నిర్భయంగా తమకు ఫిర్యాదు చేస్తే సంబంధిత ఆధారాలతో అవినీతి అధికారులను పట్టుకుంటామని తెలిపారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

తదుపరి వ్యాసం