Warangal : ఆసియాలోనే అతిపెద్ద చర్చి.. క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరానికి అంతర్జాతీయ అవార్డులు
19 July 2023, 10:54 IST
- Karunapuram Church: ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా చెబుతున్న కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరానికి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కింది. 2 అంతర్జాతీయ స్థాయి అవార్డులు వచ్చినట్లు నిర్వహకులు చెప్పారు.
కరుణాపురం క్రీస్తు జ్యోతిప్రార్ధన మందిరం
Karunapuram Church in Warangal District: క్రీస్తు జ్యోతిప్రార్ధన మందిరం.... ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కరుణాపురంలో అద్భుతంగా నిర్మించారు. 11 ఎకరాల సువిశాల స్థలంలో 2016 జూన్ 11న ఈ మందిరానికి పునాది వేయగా.... మే 4, 2023 ప్రారంభించారు. చర్చి నిర్మాణానికి రూ. 70 కోట్లు ఖర్చు చేయగా...రెండంతస్తుల్లో హాల్‌ను రూపొందించారు. ఇప్పటికే ఈ చర్చిని... ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణంగా చెబుతున్నారు నిర్వహకులు. అయితే తాజాగా ఈ చర్చికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇందుకు సంబంధించిన వివరాలను క్రీస్తు జ్యోతి ప్రార్ధన మందిరం వ్యవస్థాపకులు పాస్టర్ పాల్సన్ రాజ్ తో పాటు జయ ప్రకాష్ వివరించారు.
కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్ధన మందిరం ఆసియాలోనే అతిపెద్ద చర్చి నిర్మాణమని వారు తెలిపారు. ప్రార్ధన మందిరానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం అదృష్టమని అన్నారు. ఈ చర్చిలో ఒకేసారి 40వేల మంది ప్రార్థన చేసుకోవచ్చని... ఈ అద్భుతమైన చర్చిని మే 4 ,2023న ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ మేరకు తమ సేవను గుర్తించి రెండు అంతర్జాతీయ అవార్డులు వరించాయన్నారు . జూన్ 16వ తేదీన 'పీస్ ప్రైజ్ 2023'ను యూ.స్ కాంగ్రెస్ మెన్ డానీ కే. డేవిడ్ చేతుల మీదుగా అందుకున్నట్లు పేర్కొన్నారు. ఇక 'యూ.స్ హౌస్ అఫ్ రెప్రజెంటివ్ కాంగ్రెస్ నల్ అవార్డు మెడల్'తో పాటు ప్రశంసా పత్రాన్ని యూ. స్ ఎంపీ జూన్సన్ జాక్సన్ చేతుల మీదుగా అదుకున్నట్లు వివరించారు. తమ కృషికి అంతర్జాతీయ గుర్తింపు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు అందించిన అమెరికా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరం ప్రత్యేకతలు:
- ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కరుణాపురంలో(స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం) ఉంది.
- ఇక్కడ 1992లోనే చర్చి నిర్మాణం ఉంది. ఇదే ప్రాంతంలో అతిపెద్ద చర్చిని నిర్మించారు.
- ఈ చర్చిని 11 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించారు. మొత్తం ఖర్చు రూ. 70 కోట్లు.
- చర్చి ప్లింత్ ఏరియా 1,50,000 చదరపు అడుగులు కాగా, మొత్తంగా 240 అడుగుల వెడల్పులో చేపట్టారు. ఎత్తు 125 అడుగులుగా ఉంది.
- చర్చి పైభాగంలో అల్యూమినియం గోపురాన్ని (డోమ్)ని అమర్చారు. దీన్ని అమెరికా నుంచి తీసుకొచ్చారు. ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టం కొనుగోలు చేశారు. ఎల్‌ఈడీ స్క్రీన్స్‌తో కూడిన ప్రత్యేక వేదిక, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2 ఎల్‌ఈడీ స్క్రీన్లు ఉన్నాయి. పిల్లర్ల నిర్మాణంలో హాలెండ్ టెక్నాలజీ వాడారు.
- ప్రార్థనలకు వచ్చే వారికోసం హెలికాప్టర్ పంకా తరహాలో భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు.
- ఈ చర్చిలో ఒకేసారి 40వేల మంది ప్రార్థనలు చేయవచ్చు.