తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Memberships: Bjp సభ్యత్వంలో కరీంనగర్ టాప్, సభ్యత్వం తీసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌

BJP Memberships: BJP సభ్యత్వంలో కరీంనగర్ టాప్, సభ్యత్వం తీసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌

HT Telugu Desk HT Telugu

25 November 2024, 6:02 IST

google News
    • BJP Memberships: BJP Memberships భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలిచింది. పార్టీ నాయకత్వం విధించిన లక్ష్యాన్ని మించి సభ్యులను నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షల 67 వేల సభ్యత్వాన్ని నమోదు చేయించాలని లక్ష్యం విధించగా,  దాదాపు 30 లక్షల సభ్యత్వం నమోదు చేశారు. 
కరీంనగర్‌లో బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్న బండి సంజయ్
కరీంనగర్‌లో బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్న బండి సంజయ్

కరీంనగర్‌లో బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్న బండి సంజయ్

BJP Memberships భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలిచింది. పార్టీ నాయకత్వం విధించిన లక్ష్యాన్ని మించి జిల్లాలో సభ్యులను నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షల 67 వేల సభ్యత్వాన్ని నమోదు చేయించాలని లక్ష్యం విధించగా, నేటి వరకు దాదాపు 30 లక్షల సభ్యత్వం నమోదు చేశారు. అనుకున్న లక్ష్యంలో 75 శాతానికి చేరుకోవడం గమనార్హం.

బిజేపి సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలిచింది. సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు.

సభ్యత్వ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్ కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అట్లాగే అసెంబ్లీ వారీగా చూస్తే కరీంనగర్, పార్లమెంట్ వారీగా చూస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం సైతం నాయకత్వం విధించిన లక్ష్యాన్ని మించి సభ్యత్వ నమోదు చేయడం హర్షణీయమన్నారు.‌ కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెబుతున్నానని తెలిపారు. వాళ్ల కృషి ఫలితంగానే సభ్యత్వ నమోదులో నెంబర్ వన్ గా నిలిచామని, పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలందరికీ అభినందనలు తెలిపారు

అట్టడుగున ములుగు.. భూపాలపల్లి..

జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలిచింది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 2 లక్షలకుపైగా సభ్యత్వాన్ని నమోదు చేయడం విశేషం. సభ్యత్వ నమోదులో భూపాలపల్లి, ములుగు జిల్లాలు అట్టడుగున ఉన్నాయి. ఆయా జిల్లాల్లో 20 వేలలోపే సభ్యత్వం నమోదైంది. అసెంబ్లీ వారీగా చూస్తే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి 61 వేల మంది సభ్యులను చేర్పించాలని లక్ష్యం విధించగా, 70 వేలకుపైగా సభ్యులను నమోదు చేయించడం విశేషం.

పార్లమెంట్ నియోజకవర్గం వారీగా పరిశీలిస్తే...ఇచ్చిన టార్గెట్ ను అధిగమించిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో కరీంనగర్ అగ్రభాగాన నిలిచింది. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షలకుపైగా సభ్యత్వాన్ని నమోదు చేశారు. కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విధించిన లక్ష్యాన్ని మించి సభ్యత్వాన్ని నమోదు చేశారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

టాపిక్

తదుపరి వ్యాసం