తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Gangula Kamalakar : కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేస్తే కర్ణాటక మాదిరిగానే కరెంట్ కష్టాలు- మంత్రి గంగుల కమలాకర్

Minister Gangula Kamalakar : కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేస్తే కర్ణాటక మాదిరిగానే కరెంట్ కష్టాలు- మంత్రి గంగుల కమలాకర్

HT Telugu Desk HT Telugu

21 October 2023, 22:01 IST

google News
    • Minister Gangula Kamalakar : ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారే తప్ప ఏది అవాస్తమయో, ఏది నిజమో రాహుల్ గాంధీ తెలుసుకోలేపోతున్నా్రని విమర్శించారు.
మంత్రి గంగుల కమలాకర్
మంత్రి గంగుల కమలాకర్

మంత్రి గంగుల కమలాకర్

Minister Gangula Kamalakar : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ బస్సుయాత్రలో అన్ని అసత్యాలే మాట్లాడుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ గ్రామాల్లో నియోజకవర్గ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ బస్సు యాత్రలో అడుగడుగునా అసత్యాలు మాట్లాడుతున్నాడని, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారే తప్ప ..అందులో ఏది నిజమో ఏది అవాస్తవమో కూడా గమనించడంలేదన్నారు. కాళేశ్వరం పథకంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎప్పుడు పాడిన పాత పాటే పాడారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చు అయితే..లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో..రాహుల్‌గాంధీ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ పర్యటించిన ప్రాంతమంతా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లొస్తున్న ప్రాంతమేనని..ప్రాజెక్టు వద్దకు వెళ్లి పరిశీలిస్తే కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు గొప్పతన తెలిసేదన్నారు.

కర్ణాటకలో రైతులకు కరెంట్ కష్టాలు

రాహుల్ గాంధీ పర్యటించిన ప్రాంతాల్లో రైతులను అడిగినా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పేవారని మంత్రి గంగుల ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పాలనలో భూములకు సంబంధించిన ఒక్క రికార్డునైనా ఆధునీకరణ చేయలేదని...రైతుల మంచి కోసమే తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిందన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రాహుల్ కు లేదన్నారు. దేశంలో రెండు సార్లు రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనే విషయం రాహుల్ తెలుసుకోవాలని సూచించారు. కర్నాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు హామీలు అమలుచేస్తామన్నారు. కానీ ఐదు నెలల్లోనే ఆ రాష్ట్రంలో అంధకారం నెలకొందన్నారు. కర్ణాటకలో రోజుకు వ్యవసాయరంగానికి 7 గంటల కరెంటు ఇస్తామని...రెండు మూడు గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. కర్నాటకలో గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200ల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించారని...ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు తమకు ఉచితం వద్దని.. కరెంటు బాగా ఇవ్వండి అంటూ ప్రజలు రోడ్డెక్కి ధర్నాలుచేస్తున్నారన్నారు.

బలిదానాలు జరడానికి కాంగ్రెసే కారణం

కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్క రంగుమార్చుతుందని గంగుల ఆరోపించారు. సాధారణంగా జాతీయ పార్టీకి ఒకే విధానం ఉంటుంది, కానీ.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రంగు మార్చుతోందని మండిపడ్డారు. తెలంగాణలో పింఛన్‌ రూ.4 వేలు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్‌.. మిజోరాంలో ఎందుకు రూ.2,500 లకు పరిమితం చేసిందో ప్రజలకు తెలపాలన్నారు. తెలంగాణలో రూ.10 లక్షల వరకు ఆరోగ్యభీమా కల్పిస్తామని చెపుతున్న కాంగ్రెస్‌.. మధ్యప్రదేశ్‌లో రూ.25 లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ని నమ్మి ఓటు వేస్తే కర్ణాటక మాదిరిగానే మోసం పోతామని..తెలంగాణ రాష్ట్ర సాధనలో బలిదానాలు జరడానికి కాంగ్రెసే కారణమన్నారు.

రిపోర్టర్ గోపికృష్ణ, కరీంనగర్

తదుపరి వ్యాసం