BRS Party : బీఆర్ఎస్ గూటికి మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి
07 October 2023, 8:31 IST
- TS Assembly Elections 2023: మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరుపతి రెడ్డి, ఆయన అనుచరులు గులాబీ కండువా కప్పుకున్నారు.
బీఆర్ఎస్ లో చేరిన కంఠారెడ్డి తిరుపతి రెడ్డి
బీఆర్ఎస్ లో చేరిన కంఠారెడ్డి తిరుపతి రెడ్డి
Kantareddy Tirupati Reddy Joins BRS: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీలో అవకాశం దక్కని నేతలు… పక్కపార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నందికంటి శ్రీధర్…. గులాబీ గూటికి చేరగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా మాజీ జిల్లా ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) లో జాయిన్ అయ్యారు.