తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jntu: టెట్ తరహాలో ఇంజినీరింగ్ అధ్యాపక్తుల భర్తీకి అర్హత పరీక్ష..!

JNTU: టెట్ తరహాలో ఇంజినీరింగ్ అధ్యాపక్తుల భర్తీకి అర్హత పరీక్ష..!

HT Telugu Desk HT Telugu

01 June 2022, 14:16 IST

    • ఇంజినీరింగ్ కాలేజీల్లో అధ్యాపకుల భర్తీకి సరికొత్త నిర్ణయం తీసుకునే దిశగా జేఎన్టీయూ కసరత్తు చేస్తోంది. ఇక నుంచి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.
ఇంజినీరింగ్ అధ్యాపకులకు అర్హత పరీక్ష
ఇంజినీరింగ్ అధ్యాపకులకు అర్హత పరీక్ష

ఇంజినీరింగ్ అధ్యాపకులకు అర్హత పరీక్ష

ఇంజినీరింగ్ కాలేజీ వ్యవస్థల బలోపేతంపై దృష్టిపెట్టింది జేఎన్టీయూ. ఇప్పటికే అధ్యాపక సిబ్బంది నియామకాల విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి. అందులోనూ ప్రైవేటు కాలేజీలు ఇష్టారాజ్యంగా నియమించుకుంటూ... కాలం వెళ్లదీస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధించే అధ్యాపక్తుల భర్తీపై నూతన విధానం అమల్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది జేఎన్టీయూ. ఇక నుంచి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

200కు పైగా గుర్తింపు కాలేజీలు..

జేఎన్‌టీయూ పరిధిలో దాదాపు 200కు పైగా గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఇందులో అధ్యాపకుల నియామకం ఆయా కళాశాలలే చూసుకుంటున్నాయి. ఫలితంగా కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులు అధ్యాపకులుగా నియమితులు కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడుతుండటం, ర్యాటిఫై ప్రక్రియలోనూ అక్రమాలు చోటు చేసుకోవటం వంటి వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటిపై దృష్టిసారించిన జేఎన్టీయూ చెక్ పెట్టాలని భావించింది. దీనిలో భాగంగా జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతుంది.

అర్హత పరీక్ష రాయాల్సిందే..!

ఇంజినీరింగ్ కాలేజీల్లో అధ్యాపక సిబ్బందిగా పని చేయాలనుకునే వారు.. తప్పనిసరిగా జాతీయ స్థాయి పరీక్షను రాయాల్సి ఉంటుంది.ఇందులో అర్హత సాధిస్తేనే కాలేజీల్లో పని చేయటానికి వీలు ఉంటుంది. తద్వారా కాలేజీల్లో అధ్యాపక సిబ్బంది నియామకాల విషయంలో జవాబుదారితనం వస్తుందని అంచనా వేస్తోంది జేఎన్టీయూ. ఈ మేరకు త్వరలోనే ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసే పనిలో ఉంది.

ఒక్కసారి క్వాలిఫై అయితే...!

ఈ పరీక్షలో ఒక్కసారి క్వాలిఫై అయితే జీవిత కాలం చెల్లుబాటు అవుతుంది. ఇప్పటికే తెలంగాణలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షలో ఇదే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. గతంలో ఏడేళ్ల పరిమితి ఉండగా.. తాజాగా జీవిత కాలం చెల్లుబాటు అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. ఇదే పద్ధతిలో ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకుల విషయంలోనూ వర్తింపజేయనున్నారు.

ప్రభుత్వ వర్శిటీలు, ఎయిడెడ్ కాలేజీల్లో బోధన సిబ్బందికి సెట్, నెట్ వంటివి తప్పనిసరి చేశారు. వీటిల్లో అర్హత సాధించినవారికి మాత్రమే అధ్యాపకులుగా అవకాశం ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ ఈ తరహా విధానం తీసుకురావటం ద్వారా ఇంజినీరింగ్ విద్యావ్యవస్థలో మార్పులు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు ఎంతో లాభం చేకూరుతుందని అంటున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం